1960 జ్ఞాపకాల్లోకి నాగార్జున
కింగ్ నాగార్జున తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం విషయంలో అంత ఆశ్చర్యపోయే విషయాన్ని తెలియజేసిన నాగార్జున తన చిన్నతనంను కూడా గుర్తు చేసుకున్నారు. 1963లో నాన్న గారు చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చారు. ఆ సమయంలో వ్యవసాయంపై ఆసక్తితో హుస్సేన్ సాగర్ ను ఆనుకుని దాదాపు 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అక్కడే ఇళ్లు కట్టుకుని ఉండేవాళ్లం. ఆ సమయంలోనే నాకు వ్యవసాయం గురించి తెలిసింది. తమకు ఉన్న వ్యవసాయ భూమిలో అనేక పంటలు కూరగాయలు పండించేవారు. ఫౌల్ట్రీ ఫామ్ తో పాటు చేపల కోసం చిన్న బాయిని కూడా తీసినట్లుగా నాగార్జున తెలియజేశారు.
తన బాల్యం మొత్తం అలా వ్యవసాయ క్షేత్రంలోనే గడిచిందని పేర్కొన్నారు. అప్పట్లో హైదరాబాద్ ఒక పెద్ద గ్రామం మాదిరిగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ట్యాంక్ బండ్ కు పక్కనే తమ పొలం ఉండేదని నాగర్జున పేర్కొన్నారు. చిన్నతనంలో వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసేవాడిని. ఆవులను కడగడం ఆవు పాలు పిండటం వంటివి కూడా చేశానంటూ నాగార్జున చెప్పారు. ఇక్కడ ఉన్న సమయంలో ఫిట్ నెస్ విషయంలో ఎక్కువగా నేను ఫోకస్ చేసేవాడిని కాదు. ఎప్పుడైతే అమెరికా వెళ్లానో అప్పటి నుండి ఫిట్ నెస్ విషయమై ఎక్కువ శ్రదను కనబర్చుతూ వచ్చాను అన్నాడు.