నాగ్.. స్వామి ప్రభుపాద??

Update: 2017-01-12 03:47 GMT
అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో భక్తిరస చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయిన సంగతి తెలిసిందే. అన్నమయ్య దగ్గర నుంచి మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ వరకూ కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో శ్రీరామదాసు.. షిర్టీ సాయిబాబాగా కూడా ఆకట్టుకున్నాడు నాగ్.

తాజాగా ఓం నమో వేంకటేశాయ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున ఓ కామెంట్ చేశారు. రచయిత జే.కే. భారవి తీసుకొచ్చిన మరో స్క్రిప్ట్ విపరీతంగా ఆకట్టుకుందని.. మాటవరసకు చెప్పాడు నాగార్జున. ఇది కూడా భక్తిరస చిత్రమే అని తెలుస్తోంది. అసలు భారవి రచనలన్నీ స్పిరిట్యువల్ గానే ఉంటాయి. ఈసారి నాగార్జున 'స్వామి ప్రభుపాద' పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇస్కాన్ ఫౌండర్ అయిన స్వామి ప్రభుపాద బయోపిక్ ను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారట నాగార్జున.

హరేకృష్ణ మూవ్ మెంట్ నుంచి స్టార్ట్ చేసి.. గురు ప్రభుపాదగా ఎదిగిన జీవిత చరిత్ర ఎంతో ఆసక్తిదాయకంగాను.. స్ఫూర్తివంతంగానూ ఉంటుంది. ఈ కథ నచ్చడంతో.. ఈ చిత్రాన్ని చేసేందుకు నాగ్ సిద్ధమయ్యాడట. ఇంతకంటే హైలైట్ ఏంటంటే.. నాగ్ హీరోగా నటిస్తే.. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ఇస్కాన్ వాళ్లు ఇంట్రెస్ట్ చూపిస్తుండడమే. అన్నీ కుదిరితే.. నాగ్ మరోసారి భక్తిరస చిత్రంతో సందడి చేయడం ఖాయం అనుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News