రక్తం తాగుతున్నారు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Update: 2020-05-05 11:10 GMT
విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ తెరపైకి దూసుకొచ్చిన ఈ హీరో తెరమీదే కాదు.. తెర బయట కూడా అగ్రెసివ్ అని నిరూపించుకున్నాడు. కరోనా టైంలో ఉపాధి లేక తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్ ’ స్థాపించి అందులో మధ్యతరగతి ప్రజలకు తన సంస్థ ద్వారా సహాయం అందిస్తున్నాడు.

దీనిపై తాజాగా కొన్ని వెబ్ సైట్లు తప్పుడు కథనాలు రాశాయి. తనను ఇంటర్వ్యూ అడిగారని.. ఇవ్వను అన్నందుకు కక్షగట్టి ఇలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయ్ ఆరోపించారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో కొన్ని వెబ్ సైట్స్ రాసిన కథనాలు చదివి మరీ వాటిని కడిగిపారేశారు. ఇది వైరల్ అయ్యింది. ఈ విషయంలో టాలీవుడ్ మొత్తం కదిలివచ్చి విజయ్ కు అండగా నిలబడింది.

కొన్ని వెబ్ సైట్స్ ఇష్టారీతిలో వార్తలు రాస్తూ తన ప్రతిష్టను దిగజార్చుతున్నాయంటూ టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రేపిన కామెంట్స్ దుమారం టాలీవుడ్ లో చల్లారడం లేదు. ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి విజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ సహా కొరటాల, హరీష్ శంకర్, చిరు, అనిల్ రావిపూడి, రవితేజ అల్లరి నరేష్ ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విజయ్ కు తమ మద్దతు ప్రకటించారు.

ఇక ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా విజయ్ దేవరకొండకు మద్దతు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన నాగబాబు సంచలన వ్యాక్యలు చేశారు.

నాగబాబు ట్వీట్ చేస్తూ.. ‘విజయ్ దేవరకొండకు తన పూర్తి మద్దతు తెలుపుతున్నాను. ఇలాంటి వెబ్ సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసిందని.. సినీ పరిశ్రమ రక్తాన్ని వాళ్లు జలగల్లా పీల్చేస్తున్నారు. నీ ప్రతిస్పందనకు థ్యాంక్స్. ఈ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని నాగబాబు నిప్పులు చెరిగారు.
Tags:    

Similar News