నాగ శౌర్య మూగ, చెవిటి..!

Update: 2020-12-16 05:39 GMT
ఎప్పుడో తెరంగేట్రం చేసిన యువ హీరో నాగ శౌర్య.. కెరీర్ ఇప్పుడు ఊపందుకుంది. అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన శౌర్య చేతిలో ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో సూపర్ ప్రాజెక్టు డిస్కషన్ లో ఉంది. అదే నటసింహం నందమూరి బాలయ్యతో చేయబోయే మూవీ. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాలో నాగ శౌర్యది నలభై నిమిషాల పాత్ర అని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ సినిమాకు ఎంతో కీలకమని అంటున్నారు.

ఈ సినిమాలో శౌర్య మూగ, చెవిటి వాడిగా నటిస్తాడని తెలుస్తోంది. అయితే..  ఎమోషనల్ గా ఉండదట. క్యారెక్టర్ మొత్తం మంచి ఫన్ తో ఉంటుందని టాక్.  సినిమాలో ఈ పాత్ర సుమారు 45 నిమషాల పాటు ఉంటుందట. బాలకృష్ణ ది మాత్రం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. కుమారి 21 ఎఫ్ సినిమాను కన్నడంలో రూపొందించిన దర్శకుడు శ్రీమన్ వేముల.. ఈ సినిమా కథ తయారుచేశారు. బాలయ్యకు వినిపించడం కూడా జరిగిందట.

కథ బాగాానే ఉందని చెప్పినప్పటికీ.. ఇంకా ఏ నిర్ణయం తెలియచేయలేదట ఈ నటసింహం. మరి, బాలయ్య ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? ఎప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అన్నది చూడాలి.
Tags:    

Similar News