సెన్సార్ టాక్: ప్రేమమ్ పని పూర్తయ్యిందట

Update: 2016-09-27 15:22 GMT
ఈ దసరా సీజన్లో రొమాంటిక్ యువకులు.. రొమాన్స్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ''ప్రేమమ్'' సినిమానే అని చెప్పాలి. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా సెన్సార్ పనులు ఆల్రెడీ పూర్తయినట్లు తెలుస్తోంది.

పూర్తిస్థాయి రొమాంటిక్ సినిమా.. దానికి తోడు సినిమా అంతా ప్రేమ మయం.. ఇక కాలేజీలో ఫైట్లు.. హీరోయిన్లతో జోకులు.. అదిరిపోయే కామెడీ.. అన్నీ కలుపుకుని సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ తెప్పించినట్లు తెలుస్తోంది. సినిమాను సెన్సార్ బోర్డులోని రొమాంటిక్ సినిమా లవర్స్ అందరూ బాగా ఎప్రిషియేట్ చేశారట. ముఖ్యంగా కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్లలో నాగ చైతన్య పెర్ఫామెన్స్ టాప్ నాచ్ గా ఉందని టాక్ వినిపిస్తోంది. అలాగే గోపి సుందర్ కూడా తన నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడట. ఇక శృతి హాసన్ తన క్యూట్ లుక్స్ తో చంపేస్తే.. చలాకీ పిల్లగా అనుపమ పరమేశ్వరన్.. అలాగే సీరియస్ లవర్ గా మడోన్నా సెబాష్టియన్ కూడా అలరించిందని తెలుస్తోంది.

మొత్తానికి అక్టోబర్ 7న దసరా సందర్భంగా మన ముందుకు వస్తున్న నాగ చైతన్య.. ష్యూర్ షాట్ హిట్టు కొడతాడని ఇండస్ర్టీలో వినిపిస్తోంది.
Tags:    

Similar News