నాగచైతన్యను డైరెక్ట్ చేయనున్న 'గ్రహణం' డైరెక్టర్
టాలీవుడ్ అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో ఎవరంటే మాత్రం.. నాగచైతన్య అనే చెప్పాలి. మజిలీ సినిమా భారీ విజయం అందుకొని ఏడాది పైనే అయినా ఇంతవరకు చైతు నుండి మరో సినిమా రాలేదు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చైతుకి జోడిగా సాయిపల్లవి నటిస్తుంది. ఈ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక నాగచైతన్య ఇటీవలే ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న నందినీ రెడ్డితో ఒకటి, అలాగే గతంలో మనం వంటి అద్భుతమైన సినిమా తీసిన విక్రమ్ కె.కుమార్ డైరెక్టర్ తో ఓ సినిమా చేశాడట. ఇక తాజాగా విక్రమ్ కె.కుమార్ తో చేయబోయే సినిమాకు 'థాంక్ యూ' అనే సింపుల్ టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం.
ఆ సినిమాల తర్వాత ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమాకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ మూవీని సాహు గారపాటి నిర్మిస్తారట. చాలా కాలంగా వీరిద్దరి కాంబినేషన్లో మూవీ తీయడానికి ట్రై చేశారట కానీ ఇంతవరకు కుదరలేదు. అయితే ఈ కొత్త సినిమాతో వీరిద్దరూ కలిసి పని చేయనున్నారు. “గ్రహణం” మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన “అష్టా చెమ్మా” “జెంటిల్ మేన్” “అంతకుముందు ఆ తరువాత" “అమీ తుమీ” “సమ్మోహనం” ఇలా అన్నీ ఘనవిజయం సాధించాయి. నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “వి" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక నాగచైతన్యతో రూపొందించే మూవీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. చూడాలి మరి మోహన్ కృష్ణ ఎలాంటి ప్రయోగం చేయనున్నారో..!