పవన్ సినిమాల గుట్టు విప్పేసిన మెగా బ్రదర్

Update: 2020-04-13 04:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు క‌ళ్ళు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. కరోనా లేకపోతే ఈ పాటికే ప‌వ‌న్ సినిమా రావ‌డానికి అంతా సిద్ధ‌మై ఉండేది. ఇప్ప‌టికే పింక్ సినిమా రీమేక్ వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వ‌చ్చేది. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకాస్త బ్యాలెన్స్ ఉందట. మ‌రో షెడ్యూల్ పూర్తైతే కానీ ప‌వ‌న్ సినిమా రాదు. ఇప్పుడు ఈ సినిమా పై మెగా బ్రదర్ నాగ‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు వెల్లడించాడు. పింక్ సినిమాపై ముందు నుంచి కూడా ప‌వ‌న్ చాలా ఆస‌క్తి చూపించాడ‌ని.. ఆ సినిమా రీమేక్ చేయాల‌నుంద‌ని ఒక‌ట్రెండు సార్లు త‌న‌కు చెప్పాడ‌ని నాగబాబు తెలిపాడు. అదీగాక పింక్ రెండు భాష‌ల‌తో పోలిస్తే క‌చ్చితంగా తెలుగులో మ‌రో 10 శాతం బెట‌ర్ మెంట్ చేసార‌ని చెప్పాడు.

ఇదిలా ఉండగా క్రిష్ సినిమా గురించి కూడా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు నాగ‌బాబు. ముఖ్యంగా ఈ సినిమాలో ప‌వ‌న్ మొగ‌లాయిల క‌థ చేస్తున్నాడ‌ని అస‌లు విష‌యం చెప్పాడు. ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని చాలా ఎగ్జైటింగ్‌గా చెప్పాడు. ఈ పీరియాడిక్ క‌థ‌ను క్రిష్ కూడా పవన్‌ ఇమేజ్ కి స‌రిపోయేలా రెడీ చేస్తున్నాడ‌ట. ఈ రెండు సినిమాలు త‌ప్ప‌కుండా ప‌వ‌న్ అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వ‌డం ఖాయం అంటున్నాడు మెగా బ్ర‌ద‌ర్. నాగబాబు మాటల త‌ర్వాత సినిమాల‌పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. ఇందులో వ‌కీల్ సాబ్ 2020లో విడుద‌ల కానుంది కానీ క్రిష్ సినిమా మాత్రం 2021లో విడుద‌ల కానుందని తెలుస్తుంది. ఏఎం ర‌త్నం ఈ సినిమాను 100 కోట్ల‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News