వీడియో : ముద్దుగుమ్మల భుజ బల ప్రదర్శణ

Update: 2020-11-12 07:50 GMT
హీరోలు సాదారణంగా భుజ బలం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సరదాగా జరిగే ఈ పోటీలు అందరికి ఆసక్తిని కలిగిస్తాయి. సీరియస్ స్టార్స్‌ మద్య పోటీ జరగదు కాని జనాలు మాత్రం అలాంటి పోటీలపై ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. బాలీవుడ్‌ మూవీ లక్ష్మి చిత్రీకరణ సందర్బంగా ముద్దుగుమ్మలు కియారా అద్వానీ మరియు ముస్కాన్‌ లు సెట్స్‌ లో హ్యాండ్‌ టు హ్యాండ్‌ బల ప్రదర్శణ చేశారు. ఇద్దరు కూడా చాలా సేపు ప్రయత్నించారు. ముస్కాన్‌ కాస్త ఎక్కువ బలం కనబర్చినట్లుగా అనిపించింది. అంతలో ఏదో మాట చెప్పి కియారా తన వైపుకు మార్చుకుంది. ఎవరు గెలిచారు అనే విషయం వీడియోలో చూపించలేదు. కాని మొత్తానికి మాత్రం వీడియో చాలా సరదాగా ఉండటంతో నెట్టింట వైరల్‌ అవుతోంది.

కియారా అద్వానీ తెలుగులో 'భరత్‌ అనే నేను' మరియు 'వినయ విదేయ రామ' సినిమాల్లో నటించింది. ఆ సినిమాల తర్వాత బాలీవుడ్‌ లో ఈ అమ్మడు బిజీ అయ్యింది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా అక్షయ్‌ కుమార్‌ తో 'లక్ష్మి' సినిమా చేసింది. ఆ సినిమా తాజాగా ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ముస్కాన్‌ ఈ వీడియోను షేర్‌ చేసింది. తెలుగులో జార్జి రెడ్డి సినిమాలో నటించి మెప్పించిన ముస్కాన్‌ మళ్లీ కనిపించకుండా పోయింది. హిందీలో ప్రస్తుతం అడపా దడపా సినిమాలు ఈ అమ్మడు చేస్తుంది.
Tags:    

Similar News