• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: బ్యాచిలర్...

వీడియో: బ్యాచిలర్ పార్టీలో MEB టీమ్ సందడి..!

By - Tupaki Desk
Update: 2021-10-06 15:56 GMT
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' సినిమా దసరా కానుకగా ఈ నెల 15న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ కలిసి నిర్మించారు. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పటికే ట్రైలర్ 8 మిలియన్ల వ్యూస్ అందుకుంది. పాటలు కూడా శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక ఇటీవల నిర్వహించిన ర్యాప్ అప్ పార్టీ గ్రాండ్ సక్సెస్ అయింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అఖిల్ - బొమ్మరిల్లు బాస్కర్ - బన్నీ వాసు - వాసు వర్మ - సంగీత దర్శకుడు గోపీ సుందర్ లతో పాటుగా ఈ చిత్రానికి పనిచేసిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అందరూ ఈ వీడియోలో కనిపిస్తున్నారు.

MEB చిత్రంలో కీలక పాత్రలు పోషించిన జబర్దస్త్ సుధీర్ మరియు గెటప్ శ్రీను లు ర్యాప్ అప్ పార్టీలో స్టాండ్-అప్ కమెడియన్లుగా నవ్వించారు. హీరో అఖిల్ - దర్శకుడు భాస్కర్ - కెమెరామెన్ ప్రదేశ్ శర్మ సెట్స్ లో ఎలా బిహేవ్ చేస్తారనేది ఫన్నీగా వివరించారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే పేరుని 'బిజీ హెగ్డే' గా మార్చినట్లు చెప్పి అందర్నీ నవ్వులు పూయించారు. అలానే మురళీశర్మ - శ్రీకాంత్ అయ్యంగార్ - అజయ్ లను కూడా ఆట పట్టించారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా షూటింగ్ దాదాపుగా రెండేళ్లుగా జరిగుతుందని చెబుతూ.. అఖిల్ లో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో చమత్కారంగా తెలిపారు. ఈ వీడియోలో సుధీర్ మరియు శ్రీను కలిసి మిగతా MEB టీమ్ అందరినీ ట్రోల్ చేయడాన్ని చూడొచ్చు. మొత్తం మీద ఈ సినిమా షూటింగ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఫన్నీగా జరిగినట్లు ర్యాప్ అప్ పార్టీ వీడియోని బట్టి అర్థం అవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 8న JRC కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి అఖిల్ అన్న, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.

కాగా, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా భాస్కర్ గత చిత్రాల తరహాలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిందని తెలుస్తోంది. ఇందులో ఆమని - ఈషా రెబ్బా - ఫారియా అబ్దుల్లా - చిన్మయి - వెన్నెల కిషోర్ - జయప్రకాష్ - అజయ్ - ప్రగతి - అమిత్ తివారి - పోసాని కృష్ణ మురళి - అభయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తండ్ కే వెంకటేశ్ ఎడిటర్ గా వర్క్ చేశారు. ఇకపోతే సాలిడ్ హిట్ కోసం కష్ట పడుతున్న అక్కినేని అఖిల్ కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మరి అఖిల్ కు ఎలాంటి సక్సెస్ అందుతుందో చూడాలి.


Full View
Tags:    
  • Most Eligible Bachelor 
  • Pooja Hegde 
  • Akhil Akkineni 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS