• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ సరసన నిలిచేందుకు...

చైతూ సరసన నిలిచేందుకు కాస్త దూరంలో అఖిల్‌

By - Tupaki Desk
Update: 2021-10-17 14:55 GMT
కరోనా కారణంగా వందల కోట్లు రాబట్టే బాలీవుడ్ సినిమాలు కనీసం పాతిక కోట్లు రాబట్టేందుకు కిందా మీద పడుతున్నాయి. అలాంటిది మన తెలుగు సినిమాలు ఈజీగా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున వసూళ్లు నమోదు చేస్తున్న తెలుగు సినిమాలు ఓవర్సీస్ మరియు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నాయి. ఈ ఏడాది విడుదల అయిన జాతి రత్నాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్లను దక్కించుకుంది. మళ్లీ సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదల అయిన లవ్‌ స్టోరీ సినిమా కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు సినిమాలు మాత్రమే ఓవర్సీస్‌ లో మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరాయి అనుకుంటున్న సమయంలో మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా మిలియన్ డాలర్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్‌ హాఫ్‌ మిలియన్‌ ను క్రాస్ చేసింది. కనుక అతి త్వరలోనే మిలియన్ డాలర్లను చేరుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి సందడి మరియు మహాసముద్రం సినిమాలకు రివ్యూలు పాజిటివ్ గా లేవు. ఓవర్సీస్‌ లో ఖచ్చితంగా రివ్యూల ఆధారంగానే కలెక్షన్స్ ఉంటాయి. బ్యాచిలర్ కు పాజిటివ్‌ రివ్యూలు వచ్చిన కారణంగా ఖచ్చితంగా ఈ సినిమా అక్కడ లాంగ్‌ రన్ లో మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అఖిల్ తన హాలో సినిమా తో అక్కడ మిలియన్‌ క్లబ్ జాబితాలో చేరాడు. ఇప్పుడు రెండవ సారి కూడా మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి బ్యాచిలర్‌ గా రెండవ సారి చోటును దక్కించుకుంటాడని తెలుస్తోంది.

లవ్ స్టోరీతో మిలియన్ డాలర్లను వసూళ్లు చేసిన నాగ చైతన్య ను చేరుకోవడంకు అఖిల్‌ కు పెద్ద కష్టం ఏమీ కాదని.. చాలా తక్కువ దూరంలోనే అఖిల్‌ ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఈ ఏడాది మూడవ మిలియనీర్ గా బ్యాచిలర్‌ నిలుస్తాడు అంటూ యూఎస్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో పెద్ద సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కనుక అవి అక్కడ మిలియన్ మార్క్‌ లను ఈజీగా క్రాస్ చేస్తాయి అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అఖిల్ కూడా ఆ జాబితాలో ఉండటం అక్కినేని ఫ్యాన్స్ కు గర్వ కారణం కానుంది. అతి తక్కువ వసూళ్లు నమోదు అవుతున్న ఈ ఏడాదిలో అక్కినేని బ్రదర్స్‌ ఇద్దరు మిలియన్ డాలర్లను దక్కించుకోవడం మామూలు విషయం కాదు. బ్యాచిలర్ సినిమాతో అఖిల్ కు మొదటి బెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్ పడిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Most Eligible Bachelor 
  • Pooja Hegde 
  • Akhil Akkineni 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS