జగన్ పార్టీలోకి మోహన్ బాబు!

Update: 2016-04-07 04:55 GMT
మోహన్ బాబు అతి త్వరలో జగన్ రాజకీయ పార్టీలోకి చేరుతున్నారా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా జగన్.. అతని సన్నిహితులు మోహన్ బాబుతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈనెల‌లోనే.. త‌న రాజ‌కీయ రంగ పునః ప్ర‌వేశం గురించి మోహ‌న్‌బాబు ఓ నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మోహ‌న్‌ బాబే ప్ర‌క‌టించారు. ''ప్ర‌స్తుతం రాజకీయాలు ఘోరంగా ఉన్నాయి. పేప‌ర్ తిర‌గేస్తే బాధేస్తోంది. ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. నేను రావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అందుకే త్వ‌ర‌లోనే నా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తా'' అన్నారు.

అయితే కొత్తగా మోహన్ బాబు ఎలాంటి పార్టీ పెట్టట్లేదని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న పార్టీలోనే చేర‌తాన‌ని, ఏ పార్టీలో చేరినా... కుల మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌లు త‌న వెన‌కే ఉంటార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారాయ‌న‌. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో దాని వైపు మ‌న‌సు మ‌ళ్లినా.. ఇప్పుడు మాత్రం వైకాపా వైపే అడుగులు వేయాల‌ని మోహ‌న్ బాబు నిర్ణ‌యించుకొన్నార‌ట‌. చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకొంటే తప్ప జగన్ పార్టీలో మోహన్ బాబు చేరడం ఖాయమని భావిస్తున్నారు.
Tags:    

Similar News