ఆ స్టార్‌ కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్‌

Update: 2020-12-09 03:17 GMT
కన్నడ స్టార్‌ చిరంజీవి సర్జా కొన్ని నెలల క్రితం హఠత్మరణం పాలవ్వడం ఆయన అభిమానులకు కన్నీరు మిగిల్చింది. చిరంజీవి చనిపోయిన సమయంలో ఆయన భార్య మేఘనా రాజ్‌ గర్బవతిగా ఉన్నారు. ఇటీవలే ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఇప్పుడిప్పుడే చిరంజీవి మృతి బాధ నుండి బయట పడుతున్న కుటుంబంకు షాక్‌ తగిలింది. మేఘనా రాజ్‌ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరికి కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. ఇటీవల జన్మించిన బాబు కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో చిరంజీవి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మేఘనా రాజ్‌ సోషల్‌ మీడియాలో.. హలో నాకు.. అమ్మానాన్న ఇంకా నా బాబుకు కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం తమకు ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేవు. త్వరలోనే మేము కోలుకుంటాం అని నమ్మకంగా ఉన్నారు. గత వారం పది రోజులుగా మమ్ములను కలిసిన ప్రతి ఒక్కరు కూడా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండాలంటూ విజ్ఞప్తి చేసింది. చిరంజీవి మృతి నుండి బయట పడుతున్న కుటుంబంకు మళ్లీ ఇలాంటి కష్టం రావడం పట్ల కన్నడ సినీ ప్రముఖులు మరియు సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. మేఘనా రాజ్‌ కుటుంబం త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఆశిస్తున్నాం అంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
Tags:    

Similar News