మెగా హీరోలకు ట్రైలర్ నచ్చలేదా?
ఇప్పటివరకు ''సర్దార్ గబ్బర్ సింగ్'' ట్రైలర్ పై కానీ.. ఆడియోపైన కానీ.. రావల్సిన చోట నుండి మాత్రం రెస్పాన్స్ లేదు. అసలు ఆడియో రిలీజ్ నాడే వీళ్లు ఏదో ఒకటి చెబుతారు అనుకుంటే.. ఇప్పటివరకు కనీసం ట్రైలర్ పై కూడా పెదవి విప్పకపోవడం అభిమానులను కాస్త హర్ట్ చేస్తున్న విషయం.
అసలు సర్దార్ ఆడియో జరగడానికి ముందు.. మేకింగ్ వీడియో అదిరిపోయిందని ఒక ట్వీటేసిన వరుణ్ తేజ్.. ఇప్పటివరకు ఆడియో ఎలా ఉందనే విషయంపై కాని.. ట్రైలర్ ఎలా ఉందని కాని ఏమీ చెప్పకపోవడం గమనార్హం. ఇకపోతే ట్విట్టర్ లో హైపర్ యాక్టివ్ గా ఉండే అల్లు శీరీష్ అండ్ సాయిధరమ్ కూడా సర్దార్ ట్రైలర్ గురించి కామెంట్లే చేయలేదు. రామ్ చరణ్ మాత్రం ఆడియో బాగుందన్నాడు కాని.. ట్రైలర్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక బన్నీ బాబు అయితే తన ఫేస్ బుక్ అండ్ ట్విట్టర్ లో సినిమాల గురించి మాట్టాడనని చెప్పిన విషయం తెలిసిందే. క్షణం రేంజులో అదిరిపోయే సినిమా అయితేనే ఆయన కామెంట్లు చేస్తాడట.
ఇదంతా చూస్తుంటే.. తీరికలేక పవర్ స్టార్ ట్రైలర్ గురించి మెగా హీరోలు స్పందించట్లేదా? లేకపోతే ఇంకేదైనా కారణంతో వీరు రెస్పాండ్ కావట్లేదా అనే సందేహం రాక మానదు. వేరే యాంగిల్ లో చూస్తే.. వీళ్ళు ఖచ్చితంగా సర్దార్ గురించి మాట్లాడాల్సిందే అనే రూల్ ఏమీ లేదులే.