బ్యాచ్ ల‌ర్ ప్రోప‌జ‌ల్ కి చేతులెత్తేసిందా?

Update: 2020-02-15 20:30 GMT
ముంబై బ్యూటీ పూజా హెగ్డే స్టార్ డ‌మ్ చూస్తుండ‌గానే అమాంతం స్కై ఈజ్ లిమిట్! అన్న చందంగా ఎదిగేసిన సంగ‌తి తెలిసిందే. ఇంతింతై స్టార్ హీరోల‌కు ఏకైక ఆప్ష‌న్ గా మారింది. వ‌రుస‌గా అన్నీ భారీ క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ స్టార్ డ‌మ్ ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళుతోంది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ తో భారీ పారితోషికం అందుకుంటూ చెట్టెక్కి కూచుంది. ఇక మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ అయితే పూజాని ఇప్ప‌ట్లో విడిచిపెట్టేట్టు క‌నిపించడం లేదు. అర‌వింద స‌మేత- అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల్లో అవ‌కాశాలిచ్చిన త్రివిక్రమ్ త‌దుప‌రి ఎన్టీఆర్ తో సినిమాకి పూజాని లాక్ చేశార‌ని తెలుస్తోంది.

ఇక ఇంత స్పీడ్ ఉన్న భామ కాబ‌ట్టే అక్కినేని చియాన్ అఖిల్ ఏమాత్రం ఆలోచించ‌కుండా పూజాని లాక్ చేశాడు. అఖిల్ - పూజా జంట‌గా ప్ర‌స్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 బ్యాన‌ర్ పై బ‌న్నివాస్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన అఖిల్ పోస్ట‌ర్ కి ఫ్యాన్స్ నుంచి ఆస‌క్తిక‌ర స్పంద‌న‌లు వ‌చ్చాయి. తాజాగా పూజా హెగ్డే లుక్ ని రివీల్ చేశారు.

ఈ పోస్ట‌ర్ లో పూజా రెండు చేతుల‌తో షూస్ ని పైకెత్తి స్మైలీ ఎక్స్ ప్రెష‌న్ ని ఇచ్చింది. ఐ యామ్ కాంప్లాన్ గాళ్ అన్నంత ఎన‌ర్జిటిక్ గా క‌నిపించింది పూజా. ఇక ఆ థై హై స్క‌ర్ట్ తో కుర్ర‌కారు మ‌తి చెడ‌గొట్టింది. మొన్న‌టికి మొన్న అల వైకుంఠ‌పుర‌ములో బుట్ట బొమ్మ‌గా అల‌రించిన పూజా ఈసారి అల్ట్రా మోడ్ర‌న్ యువ‌తిగా క‌నిపించ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కీ అలా షూస్ చూపిస్తూ ఏం చెప్ప‌బోతోంది? ఆ మౌత్ స్పీక‌ర్ అలా పూజా ముందుకు వంగి మ‌రీ స్పీచ్ వినిపించేందుకు సిద్ధ‌మైంది. ఏప్రిల్ 2020 రిలీజ్ అంటూ పోస్ట‌ర్ పై ముద్రించారు. అఖిల్ న‌టించిన మూడు సినిమాలు నిరాశ‌ప‌రిచాయి. క‌నీసం ఈసారి నాలుగో ప్ర‌య‌త్నం అయినా సెంటిమెంటుగా హిట్టు కొడతాడ‌నే అభిమానులు భావిస్తున్నారు. అఖిల్ కి ఓ హిట్టిచ్చే పంతంతో అర‌వింద్ టీమ్ ప్రిప‌రేష‌న్ లో ఉంది. ఈ టీమ్ కి ల‌క్కీ ఛామ్ పూజా యాడైంది కాబ‌ట్టి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయిన‌ట్టే. త‌న‌ కంటే సీనియ‌ర్ లా క‌నిపించే పూజా తో అఖిల్ రొమాన్స్ ఏమేర‌కు పండించాడు? అన్న ఆస‌క్తి ఇప్ప‌టికే అభిమానుల్లో ఉంది. తెర‌పై ఈ జంట‌ను చూస్తే కానీ ఏదీ తేల్చేయ‌లేం.
Tags:    

Similar News