'నా దేహం చూసి నాకే అసహ్యం వేసేది' స్టార్ కిడ్
సెలబ్రిటీల పేరెంట్స్ వివాహేతర సంబంధాల ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతుంది. పేరెంట్స్ చేసిన పనికి సమాజంలో పిల్లలకు చిన్నచూపు, స్కూల్లో తోటి విద్యార్థుల సూటిపోటి మాటలు ఎంతో బాధపెడతాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని ప్రముఖ నటి నీనా గుప్తా - ప్రముఖ క్రికెటర్ వీవియన్ రిచర్డ్స్ గారాలపట్టి మసాబా గుప్తా తన ఇన్స్‌టాగ్రామ్‌లో తెలిపింది. ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్తూ.. ప్రముఖ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ - నీనా గుప్తాల అఫైర్ 80 - 90 దశాబ్దాలలో పెద్ద సంచలనం. పెళ్లి కాకుండానే రిచర్డ్స్ ద్వారా నీనా గుప్తా మసాబాకు జన్మనిచ్చి తల్లి అయిన వార్త పెద్ద దుమారమే రేపింది. దాదాపు ఇరవైయేళ్ళ తర్వాత నీనా గుప్తా, - రిచర్డ్స్ విడిపోయారు. వాళ్ల కూతురు మసాబా ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుందట.
తాజాగా మసాబా తన ఇంస్టాగ్రామ్ లో వర్కవుట్లు చేస్తున్న ఫొటోలు - వీడియోలను పోస్టు చేస్తుంది. తన తండ్రి రిచర్డ్స్ వెస్టిండీస్ కు చెందడం వల్ల నా దేహం అందరి ఆడపిల్లలకంటే భిన్నంగా ఉంటుంది. నా శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వస్తుందని మసాబా వాపోయింది. స్కూల్ లో నా బుగ్గలు బూరెల్లా ఉండేవి. నేను హ్యాపీగా ఫీలైనా తోటి విద్యార్థులు పెద్దగా నన్ను పట్టించుకొనే వారు కాదు. కానీ నా తండ్రి కరేబియన్ కావడంతో దేహం లక్షణాలు అలానే ఉండేవి. అదే నాకు చాలా బాధగా ఉండేది. కొన్నిసార్లు నా శరీరాన్ని చూసుకొనే స్వయంగా నేను అసహ్యించుకొనే దానిని అంటూ మసబా ఫీల్ అయింది. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చూసినవారంతా మసబాకు చాలా కష్టాలు వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు.