• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబుల్ షేడ్స్ మన్మధుడు -...

డబుల్ షేడ్స్ మన్మధుడు - టీజర్ టాక్

By - Tupaki Desk
Update: 2019-06-13 08:03 GMT
డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హీరోగా నాగార్జునకు మర్చిపోలేని క్లాసిక్ గా నిలిచిన మన్మథుడుకి సీక్వెల్ సిద్ధమవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్సకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్ గా నటించిన ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే స్టేజిలో ఉంది . ఈ సందర్భంగా టీజర్ ని విడుదల చేసింది టీం. విదేశాల్లో ఉండే హ్యాపీ ఫ్యామిలీ నాగార్జునది. ఏవో కారణాల వల్ల పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవడంతో మధ్య వయసు దాటిపోతుంది.

దీంతో అక్క-అమ్మతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఇప్పటికైనా ఆ సంగతి చూడమని ఒత్తిడి చేస్తారు. ఆఫీస్ వాళ్ళు బంధు మిత్రులు ఈ వయసులో పెళ్ళా అని షాకవుతున్నా పట్టించుకోకుండా లేట్ ఏజ్ లవ్ అండ్ రొమాన్స్ కు రెడీ అవుతాడు. అప్పుడే అతనిలోని అసలైన మన్మధుడు బయటికి వస్తాడు. తన మార్కు అల్లరి స్టార్ట్ చేస్తాడు. నేను ప్రేమలో పడను ప్రేమను పుట్టిస్తాను అనే సిద్ధాంతంతో కొత్త థియరీ చెబుతాడు. ఇది అతని గతమా లేక పెళ్లి చేసుకుందామని ఆలోచన వచ్చాక జరిగిన రొమాన్సా తెరమీదే చూడాలి. రకుల్ తో లవ్ ట్రాక్ కూడా ఇందులో భాగమే

టీజర్ చాలా కూల్ గా ఉంది. వయసు పెరిగే కొద్ది గ్లామర్ ని అంత కన్నా స్పీడ్ గా  పెంచుకుంటూ పోతున్న నాగార్జున ఇందులో కూడా లుక్స్ తోనే చంపేశాడు. ఇది ఈయనకొక్కడికే సాధ్యమేమో అనిపించేలా ఉన్నాడు. లేట్ ఏజ్ మ్యారేజ్ ని థీమ్ గా తీసుకుని దాని చుట్టూ కామెడీ అల్లే ప్రయత్నం చేశాడు రాహుల్ రవీంద్రన్.

ఎండిపోయిన చెట్టుతో నాగార్జునని పోల్చడం-కోచింగ్ ఇచ్చే వయసులో బ్యాటింగ్ అవసరమా అంటూ వ్యంగ్యంగా కామెడీ చేయడం-లక్ష్మి గారి పాత్రతో నాగ్ ని వర్జినే కదా అని ప్రశ్నించడం అంతా బోల్డ్ గా ఈగోలకు తావివ్వకుండా చూపించడం విశేషం. కొన్ని క్యుట్ హాట్ సీన్స్ కూడా ఉన్నాయండోయ్. రావు రమేష్-ఝాన్సీ-వెన్నెల కిషోర్ లాంటి' కీలక పాత్రలను రివీల్ చేశారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ న్యాచురల్ గా ఉంది. ఎం సుకుమార్ ఛాయాగ్రహణం కిట్టు విస్సాప్రగడ సంభాషణలలో కామెడీ టైమింగ్ మొత్తానికి మన్మధుడు 2 మీద అంచనాలు పెంచేశాయి. ఆగస్ట్ 9 రిలీజ్ డేట్ లాక్ చేస్తూ టీజర్ చివర్లో అధికారికంగా ప్రకటించేశారు.


Full View




Tags:    
  • Nagarjuna 
  • Rakul Preet Singh 
  • Manmadhudu 2 Teaser 
  • Manmadhudu 2 Movie Teaser 
  • Nagarjuna Manmadhudu 2 Teaser 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS