మణి సార్ సినిమాకు రియాలిటి టచ్ ఉందా?

Update: 2018-09-20 07:54 GMT
డైరెక్టర్లు చాలామందే ఉంటారు.. సూపర్ హిట్లు కూడా సాధిస్తుంటారు. ఆడియన్స్ కూడా ఆ డైరెక్టర్ల సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఇవన్నీ కామనే.  కానీ మణిరత్నం సినిమాకోసం మాత్రం ఒక సెక్షన్ ప్రేక్షకులతో పాటు సినిమా ఇండస్ట్రీ టెక్నిషియన్స్.. నటులు అందరూ ఎదురు చూస్తారు.  హిట్.. ఫ్లాపులతో సంబందం లేకుండా ఇది జరుగుతుంది. దీన్ని బట్టి దర్శకుడిగా అయన స్సంపాదించుకున్న గౌరవం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.  

మణి సార్ తాజా చిత్రం 'నవాబ్'(తమిళంలో చెక్క చివంత వానం) త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా లో భారీ తారాగణం ఉంది.  పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో కొంతమంది మణిరత్నం మళ్ళీ హాలీవుడ్ క్లాసిక్ 'ది గాడ్ ఫాదర్' ను అటు ఇటూ మర్చి చెన్నై లోకల్ మసాలా జోడించి తన స్టైల్ లో క్లాస్ గా తెరకెక్కించాడని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయన ఆల్రెడీ 'నాయకుడు' సినిమాకు చేసింది అదే కదా అనే వారికీ కూడా కొదవ లేదు.

ఇక 'నవాబ్' గురించి  మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా కోలీవుడ్ లో ప్రచారంలో ఉంది.  అదేంటంటే ఈ సినిమాలో అరవింద్ స్వామి.. ప్రకాష్ రాజ్ పాత్రలు ఇప్పుడు తమిళ నాడు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిజైన్ చేయడం జరిగిందట.  ఇక తమిళ నాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. సంఘటనలు కూడా 'నవాబ్' లో పరోక్షంగా చర్చించడం జరిగిందని టాక్.  ఆ పాత్రలో ఎవరివి అనే సంగతి ముందే బయటకు వస్తే వివాదాలు వస్తాయని మణి సార్ ఆ డీటెయిల్స్ ను సీక్రెట్ గా ఉంచుతున్నారట.  ఏదేమైనా ఆసినిమా రిలీజ్ అయితే గానీ ఈ విషయంపై మనకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
    

Tags:    

Similar News