విజనరీ డైరెక్టర్ కు బర్త్ డే విషెస్: మహేష్ బాబు
ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అనేది 15% లోపే. మరి ఇండస్ట్రీ సక్సెస్ రేట్ అలా ఉంటే వ్యక్తిగతంగా ఒక దర్శకుడి సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు?మహా అంటే పాతిక శాతం. కానీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం ఎవరికైనా దిమ్మతిరికి బొమ్మ కనపడుతుంది. ఇప్పటికి చేసింది నాలుగు సినిమాలు..నాలుగు సినిమాలూ బ్లాక్ బస్టర్లు. ఇప్పటివరకూ అయితే 100 % సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ రోజు కొరటాల శివ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కొరటాలకు బర్త్ డే విషెస్ తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన నాలుగు సినిమాల్లో రెండు చిత్రాలు సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసినవి కావడంతో మహేష్ కు కొరటాల అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఈ రోజు కొరటాల జన్మదినం సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.. "మన జెనరేషన్ లో మోస్ట్ టాలెంటెడ్ & విజనరీ డైరెక్టర్.. నా ప్రియమైన స్నేహితుడు కొరటాల శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలి" అంటూ విషెస్ తెలిపారు. ఈ ట్వీట్ తో పాటుగా కొరటాల శివ ను ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఫోటో ఒకదాన్ని పోస్ట్ చేశారు. మహేష్ బాబు మాత్రమే కాదు మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ప్రత్యేకంగా కొరటాల శివ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
కొరటాల తన నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావలిసి ఉన్నప్పటికీ చిరు నటిస్తున్న 'సైరా' చిత్రం డిలే కావడంతో ఈ సినిమా కూడా డిలే అయింది.