మహేష్ కు ఆయనంటే అంత అభిమానం
సూపర్ స్టార్ మహేష్ బాబుకు.. ఇండస్ట్రీలో సన్నిహితులు తక్కువే. మహేష్ రిజర్వ్డ్ గా ఉంటాడు. ఇండస్ట్రీ జనాలతో పెద్దగా కలవడు. పార్టీలకు వెళ్లడు. వేరే వాళ్ల సినిమాలకు సంబంధించిన వేడుకలకు కూడా మహేష్ వెళ్లడం అరుదు. అలాంటి మహేష్.. తాజాతా ఒక చిన్న సినిమా ఆడియో వేడుకకు వెళ్లాడు. తన వెంట స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. తనతో సినిమా చేయనున్న వంశీ పైడిపల్లిలను కూడా తీసుకెళ్లాడు. మహేష్ అంత ప్రత్యేకంగా భావించిన ఆ సినిమా.. వైశాఖం. సీనియర్ పీఆర్వో బి.ఎ.రాజు.. తన సతీమణి బి.జయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఇది. హరీష్.. అవంతిక జంటగా నటించారు.
మహేష్ బాబు ఇండస్ట్రీలో అత్యంత నమ్మే వ్యక్తుల్లో బి.ఎ.రాజు ఒకరు. వెయ్యికి పైగా సినిమాలకు పీఆర్వోగా పని చేసిన అనుభవం బి.ఎ.రాజుది. కృష్ణ కుటుంబంతో ఆయనకు గొప్ప అనుబంధం ఉంది. కృష్ణ రోజుల నుంచే ఆయన పీఆర్వోగా పని చేస్తున్నారు. కృష్ణకూ ఆయనంటే ఎంతో అభిమానం. ఆ తర్వాత ఆయన కొడుకు కూడా రాజును అంతే అభిమానిస్తాడు. మహేష్ సినిమాలన్నింటికీ బి.ఎ.రాజే పీఆర్వోగా ఉంటారు. మహేష్ పాల్గొనే ప్రైవేటు కార్యక్రమాల్ని కూడా ఆయన పర్యవేక్షిస్తాడు. మీడియాను కలవాలన్నా.. ఇంటర్వ్యూలివ్వాలన్నా.. రాజే చూసుకుంటాడు. అందుకే రాజు అంటే మహేష్ కు అంత అభిమానం. ఆ అభిమానంతోనే ‘వైశాఖం’ వేడుకకు వచ్చిన తన చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేశాడు మహేష్. ఇంతకుముందు ‘లవ్లీ’ సినిమాతో హిట్టు కొట్టిన జయ.. ‘వైశాఖం’తో మరో విజయం అందుకుంటానని ఆత్మవిశ్వాసంతో ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/