'మహర్షి' 10వ సారికి అరుదైన ఘనత

Update: 2021-06-19 06:30 GMT
సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు.. వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన చిత్రం మహర్షి. మహేష్‌ బాబుకు ఇది 25వ సినిమా  అవ్వడంతో ప్రత్యేకంగా ఉండాలని మొదటి నుండి అభిమానులు కోరుకున్నారు. అన్నట్లుగానే వంశీ పైడిపల్లి ఒక మంచి సబ్జెక్ట్‌ తో మహర్షి సినిమాను తెరకెక్కించాడు. 2019 లో వచ్చిన మహర్షి సినిమా మంచి రెస్పాన్స్ ను దక్కించుకోవడంతో పాటు ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల జాబితాలో కూడా నిలిచింది. మహర్షి సినిమా ను ఇప్పటికే జెమిని టీవీలో పలు సార్లు టెలికాస్ట్‌ చేశారు. ఇటీవల పదవ సారి జెమిని వారు మహర్షి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

మహర్షి సినిమా 10వ సారి టెలికాస్ట్‌ కు దాదాపుగా 8 రేటింగ్‌ రావడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. 9వ సారి కేవలం 5 రేటింగ్ వచ్చింది. అంతకు ముందు కూడా పెద్దగా రేటింగ్ వచ్చింది లేదు. కాని పదవ సారికి ఈ స్థాయి రేటింగ్ రావడం రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇన్ని సార్లు టెలికాస్ట్‌ అయిన తర్వాత కూడా మళ్లీ అంత మంది చూడటం అరుదైన ఘటనగా చెప్పుకొవచ్చు. మహర్షి సినిమా పదవ సారి టెలికాస్ట్‌ అయిన సమయంలో ఇతర ఛానెల్స్ లో మంచి సినిమాలు ఏమీ లేక పోవడం ఒక కారణం కాగా మహర్షి సినిమాకు ఆ స్టామినా ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్‌ బాబు మహర్షి రేటింగ్‌ ను ప్రస్తుతం అభిమానులు సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ చేస్తున్నారు. ఇక మహేష్‌ బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. సర్కారు వారి పాటతో పాటు మరో వైపు త్రివిక్రమ్‌ మూవీ కూడా చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మహేష్‌ బాబు గత చిత్రాలు అతడు.. ఖలేజా ఇంకా పలు సినిమాలు కూడా బుల్లి తెరపై ఇలాంటి ఎన్నో రికార్డులను దక్కించుకున్నాయి. బుల్లి తెర పై మహేష్‌ బాబు ప్రతి సినిమా కూడా చాలా స్పెషల్‌ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News