• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహానటి @26 ఇంకా స్ట్రాంగ్

మహానటి @26 ఇంకా స్ట్రాంగ్

By - Tupaki Desk
Update: 2018-06-06 06:32 GMT
విడుదల ముందు వరకు పెద్దగా అంచనాలు లేకుండా సావిత్రి గారి కథను ఎలా తీసుంటారా అనే అనుమానాల మధ్య విడుదలయిన మహానటికి ప్రేక్షకులు కనకాభిషేఖం చేసారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది వచ్చిన ఇండస్ట్రీ హిట్స్ లో ఇది కూడా స్థానం దక్కించుకోవడం సావిత్రి గారి అభిమానులనే కాదు సినిమా ప్రేమికులను సైతం ఆనందానికి గురి చేసింది. ఇప్పటికే 26 రోజుల రన్ పూర్తి చేసుకున్న మహానటి ఇప్పటి దాకా 26 కోట్ల షేర్ రాబట్టుకోవడం విశేషం. కొత్త సినిమాలు వరస బెట్టి వస్తున్నా అన్ని కేంద్రాల్లో స్టడీగా ఉండటం వసూళ్ల పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. కథ విషయంలో చిన్న చిన్న కామెంట్స్ ఉన్నప్పటికీ నాగ అశ్విన్ సావిత్రి గారి జీవితాన్ని  ఆవిష్కరించిన తీరుకు ఏకగ్రీవంగా పట్టం దక్కింది. ఇంకో రెండు వారాలు రన్ బాగానే ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. బలంగా పోటీ ఇచ్చే సినిమా మహానటి తర్వాత ఏది రాకపోవడం కూడా ప్లస్ గా మారింది.

సమ్మర్ ముగింపుకి వచ్చేసింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పాటు వాతావరణం కొంత చల్లబడింది. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో వచ్చే వారం రానున్న కళ్యాణ్ రామ్ నా నువ్వే ఒక్కటే రేస్ లో ఉంటుంది. కాలా డబ్బింగ్ సినిమా కనక పరిగణనలోకి తీసుకోలేం కానీ అంతకు ముందు వచ్చినవన్నీ రెండు వారాలకే టపా కట్టినవే. శాటిలైట్ హక్కుల రూపంలో సైతం 15 కోట్ల దాకా రాబట్టిన మహానటి వైజయంతి బ్యానర్ కు గత పదేళ్లలో దక్కని పెద్ద హిట్ గా నిలిచింది. తమిళ్ వెర్షన్ తో పాటు మలయాళంలో కూడా మంచి ఆదరణ దక్కిన మహానటికి వచ్చిన స్పందన చూసాకే మరిన్ని బయోపిక్స్ కు అడుగులు పడుతున్నాయి. మహానటి దెబ్బకు  కీర్తి సురేష్ ఇమేజ్ అమాంతం ఆకాశాన్ని అందుకుంది. దీంతో  తన రాబోయే సినిమాలు  స్వామి స్క్వేర్ పందెం కోడి 2 మీద ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి .  మహానటి వసూళ్ల పరంగా కూడా  భరోసా ఇవ్వడంతో మరిన్ని బయోపిక్ లు వచ్చేలా ఉన్నాయి.
Tags:    
  • Keerthy Suresh 
  • Mahanati Movie 
  • Telugu NEWs 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS