నాన్నకు ప్రేమతో.. లండన్ భామకి లైఫ్‌

Update: 2016-02-25 09:30 GMT
జూనియర్ ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో పొంగల్ కి వచ్చిన నాన్నకు ప్రేమతో సక్సెస్.. చాలామంది జీవితాలకు ఊరటనిచ్చింది. ఎన్టీఆర్ కి తొలి యాభై కోట్ల చిత్రం, 1నేనొక్కడినే డిజాస్టర్ తర్వాత సుకుమార్ కి హిట్, 2 భారీ ఫ్లాప్స్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కి సక్సెస్ రావడం.. ఇలా ఎంతో మందికి నాన్నకు ప్రేమతో హెల్ప్ అయింది. ఇలా ఈ మూవీతో లైఫ్ మారియిందని మరో భామ కూడా చెబుతోంది. ఎన్టీఆర్ కి హెల్ప్ చేసే పాత్రలో నటించిన లిజా వాన్ డర్ స్విసెన్ కూడా ఈ లిస్ట్ లో ఉంది.

సహజంగా బాలెట్ డ్యాన్సర్ అయిన ఈమె.. హిప్ హాప్, జాజ్ నృత్యాల్లో కూడా శిక్షణ పొందింది. అంతే కాదు.. యాక్టింగ్ లో సత్తా చాటాలనే కోరికతో లండన్ లోని ఓ ఇనిస్టిట్యూట్ లో ట్రైనింగ్ కూడా పొందింది. ఆ తర్వాత వెల్ కం టూ కరాచి, లవ్ షుధా వంటి హిందీ చిత్రాల్లో కనిపించినా పెద్దగా కలిసిరాలేదు. వాటి కోసం లండన్ లో షూటింగ్ చేసేటపుడు ఈమెతో ఓ పాత్ర చేయించారంతే. కానీ నాన్నకు ప్రేమతో చిత్రం కోసం.. లిజా తొలిసారిగా ఇండియా వచ్చింది.

కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో ఒకేసారి షూటింగ్ చేయడంతో.. ఆ చిత్రంలో కూడా మెరిశానని.. హేభా పటేల్ మంచి ఫ్రెండ్ అయిపోయిందని అంటోంది లిజా. హైద్రాబాద్ బిర్యానీ బాగా నచ్చిందని.. నాన్నకు ప్రేమతో చిత్రంలో నటించడం ద్వారా తనకు కొత్త ప్రపంచం తెలిసిందని అంటోందీ లండన్ భామ. తన కోసం దర్శకులు కేరక్టర్లు సృష్టిస్తే.. టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తానని కూడా చెప్పింది లండన్ లిజా. ఇప్పుడీ భామ తెలుగు కూడా సిన్సియర్ గా నేర్చేసుకుంటోంది.
Tags:    

Similar News