• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్: పాడుబడ్డ...

టీజర్ టాక్: పాడుబడ్డ బంగాళాలో అంజలి

By - Tupaki Desk
Update: 2018-11-17 04:43 GMT
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ హారర్ చిత్రం 'లిసా'.  ఈ సినిమాలో యోగి బాబు.. మకరంద్ దేశ్ పాండే.. మైమ్ గోపిలు ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈమధ్యే ఈ సినిమా టీజర్ విడుదల అయింది.   'జల్సా' లో ముకేష్ రుషి పాత్ర "బెదిరింపుకి భాష అవసరం లేదు.. అర్థమైపోతుంది" అంటాడు. ఇది కూడా అంతే..  తమిళ టీజరే అయినా 'భయం' కాబట్టి మీకు అర్థం అయిపోతుంది.

ఒక ఇల్లు.. అందులో దెయ్యం. హీరోయిన్ అంజలి మాత్రం ఈ ఇంట్లో అలాంటిదేమీ లేదంటుంది. ఎవరైనా పక్కనోళ్ళు మొత్తుకుంటే ఇలాంటివి నమ్మరు కదా. సొంతంగా చూస్తే అప్పుడు నమ్ముతారు. అలాగే అంజలి కి ఒకటి రెండు ఝలక్కులు తగిలిన తర్వాత నమ్ముతుంది.   'పది తర్వాత అసలు లైట్ వేయకూడదు' అంటూ ఒక భయాన్ని పెంచే డైలాగ్ చెప్పారు.  లైట్ వేస్తే అక్కడ దెయ్యాలు తాపీగా కూర్చుని ఉంటాయి. ఇక అంజలికి మాటలు రావు! బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

ఇది ఇండియాలోనే హారర్ జోనర్లో తెరకెక్కిన మొదటి 3డీ సినిమా అని ఫిలిం మేకర్స్ ప్రకటించారు.  అంటే 2D ఫ్లాట్ స్క్రీన్ పై చూసి భయపడకుండా ఎంచక్కా మనపక్కనో.. నెత్తిపైనో దెయ్యాన్ని చూసి హాయిగా భయపడొచ్చు. ఫుల్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఈ సినిమాకు దర్శకుడు రాజు విశ్వనాథ్.  సంతోష్ దయానిధి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.  ఈ సినిమాలో మన బ్రహ్మానందం కూడా ఉన్నాడోచ్.. ఇంకా ఎందుకు ఆలస్యం.. టీజర్ పారుంగ..!

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    
  • Anjali 
  • Lisa 
  • Lisa Movie 
  • Lisa Movie Teaser 
  • TElugu News 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS