మరీ లిప్ కిస్ అంటే కష్టమేనేమో!!

Update: 2017-11-01 06:08 GMT
రియాలిటీ షో అంటే మొత్తంగా రియాలిటీ ఉంటుంది అనుకోవడం భ్రమే అవుతోంది. చాలా వరకు కొన్ని టివి షోల్లో రియాలిటీ లో కూడా మసాలను మిక్స్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు వడ్డించేస్తున్నారు. కానీ అందరూ నాన్ వెజ్ వారే ఉంటారా? కొందరు పూర్తిగా  వెజ్ ని ఇష్టపడేవారు ఉంటారు. కానీ అవేమీ పట్టించుకోకుండా అందరు సమానమే అంటూ.. బుల్లి తెరపై గ్లామర్ షోలను పచ్చిగా ప్రసారం చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ వచ్చిన తర్వాత స్టార్ మాకి క్రేజ్ బాగా వచ్చిందనే చెప్పాలి. బిగ్ బాస్ షో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్తగా మొదటి సీజన్ పూర్తిచేసుకుంది. అయితే ఆ తర్వాత ఆ ఛానల్ బుల్లితెర నటీమణులతో నీతోనే అనే డాన్స్ షోని మొదలుపెట్టి మంచి గుర్తింపు ను తెచ్చుకుంటోంది. డాన్స్ చేసే వారందరు భార్యాభర్తలే అలాగే రేణుదేశాయ్ జడ్జ్ గా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు ఒక లిమిట్ లో నడిచిన ఈ షో ఇప్పుడు ఎవరు ఉహించని ట్విస్ట్ లను ఇస్తూ అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే రేణు దేశాయ్ కామెంట్స్ ప్రతి ఎపిసోడ్ కి వైరల్ అవుతుంటే.. ఇప్పుడు ఒక జంట డాన్స్ చేస్తూ.. లిప్ కిస్ పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇంకా షో టెలికాస్ట్ అవ్వలేదు. కానీ ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో ఆ కిస్ క్లిప్పింగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ క్లిప్ చాలా వైరల్ అవుతోంది. ఇప్పటికే సీరియల్స్ కి సెన్సార్ తేవాలని అంటున్నారు. రియాలిటీ షోల మీద కూడా పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. పైగా ఎక్కువగా చిన్న పిల్లలు కూడా చూసే డ్యాన్స్ షోలలో ఇలాంటి కిస్సింగ్ అంటే.. అభ్యంతరం తెలపాల్సిందే అంటున్నారు నెటిజన్లు. స్టార్ మా ఈ ఎపిసోడ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News