ఆ స్పెక్యులేషన్లను పట్టించుకోవద్దు -కొరటాల

Update: 2016-10-26 10:28 GMT
వరుసగా మూడు సినిమాలతోనూ భారీ హిట్టు కొట్టిన ఘనత రైటర్ అండ్ డైరక్టర్ కొరటాల శివకే ఉంది. అయితే నాలుగో సినిమాలో మనోడు ఏ హీరోను డైరక్ట్ చేస్తాడా అనుకుంటే.. ఈసారి మాత్రం మళ్లీ మహేష్‌ బాబు జతకట్టాడు. అందుకే ఆ సినిమా గురించి చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. హైప్ పెరుగుతోంది. అందుకే ఇప్పుడు వాటన్నింటికీ క్లారిటీ ఇచ్చేశాడు మన డైరక్టర్.

''నేను తదుపరి చేయబోయే సినిమాలో ఎటవుంటి ఫ్యాన్సీ కాంబినేషన్లూ లేవు. అదే విధంగా నా సినిమా మల్టీ స్టారర్ కూడా కాదు. అసలు బయట వినిపిస్తున్న స్పెక్యులేషన్లు ఏవీ పట్టించుకోకండి'' అంటూ క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు కొరటాల శివ. నిన్నటి వరకు నాగార్జున అండ్ మహేష్‌.. ఇవాళేమో మహేష్‌ అండ్ బాలయ్య అంటూ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొరటాల యథావిథిగా ట్విట్టర్ ద్వారా స్పందించాడు. అసలు ఇటువంటి స్పెక్యులేషన్లను పట్టించుకోవద్దని సెలవిచ్చాడు. అంటే మనోడు త్వరలో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో చేసే సినిమాలో అసలు ఏమాత్రం వేరే హీరో నటించడం అనేది కొంచెం కూడా నిజం కాదన్నమాట. అంతేకాదు.. ఆ సినిమా అసలు మల్టీ స్టారరే కాదు అంటున్నాడు కొరటాల.

ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో మల్టీ స్టారర్ అనేది ఏదీ లేదు కాని.. దాదాపు ప్రతీ సినిమాలోనూ హీరో ప్రక్కనే ఎవరో ఒక పెద్ద స్టార్ ను నిలబెడుతూ వచ్చాడు కొరటాల శివ. మిర్చిలో సత్యరాజ్.. శ్రీమంతుడు లో జగపతిబాబు.. అలాగే జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ఆ కోవకు చెందినవారే. ఆ టైపులో ఇప్పుడు కూడా భారీ క్యాస్టింగ్ ఉంటుందేమో కాని.. మరీ ఫ్యాన్సీ కాంబినేషన్లు మాత్రం ఉండకపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News