• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కొండపొలం' ఫస్ట్ లుక్:...

'కొండపొలం' ఫస్ట్ లుక్: కటారు రవీంద్ర యాదవ్ గా వైష్ణవ్ తేజ్

By - Tupaki Desk
Update: 2021-08-20 06:15 GMT
మెగా సెన్సేషన్ పంజా వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. జెట్ స్పీడ్ లో అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు రూపొందించే క్రిష్.. గతేడాది కరోనా టైంలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లి 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఓ వీడియోని మేకర్స్ విడుదల చేశారు.

ఇన్నాళ్లూ అందరూ అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ''కొండపొలం'' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేశారు. ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌ లో సెట్ చేయబడిన ఈ సినిమాకి ఇది సరైన టైటిల్ అనిపిస్తుంది. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు అదే పేరుని టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

వైష్ణవ్ తేజ్ ప్రకృతిలో భాగం అనుకునే విధంగా 'కొండపొలం' ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఇందులో వైష్ణవ్ గడ్డంతో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తుండగా.. పైన కొంతమంది అటవీ ప్రాంతంలో నడుస్తున్నట్లు చూపించారు. అలానే బ్యాగ్రౌండ్ లో గొర్రెలు మేత మేస్తున్నట్లు ఉన్న ఈ ఆసక్తికరమైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో కటారు రవీంద్ర యాదవ్ పాత్రలో మెగా మేనల్లుడు కనిపించనున్నాడు.

ఇక వీడియో విషయానికి వస్తే.. వైష్ణవ్ తేజ్ అడవిలో భయంకరమైన దుర్మార్గులను ఎదుర్కోబోతున్నప్పుడు తెలుస్తోంది. ఇందులో విజువల్స్ గ్రాండ్‌ గా కనిపిస్తుండగా.. బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ ను పెంచుతుంది. ఇది 'బికమింగ్' యొక్క పురాణ కథ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ''కొండపొలం'' చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

''కొండపొలం'' చిత్రం బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం. 8 గా రూపొందుతోంది. సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి నిర్మాతలు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.


Full View
Tags:    
  • KondaPolam 
  • Vaisshnav 
  • FirstLook 
  • Latest news 
  • Movies news 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS