మూడు తెలుగు బిగ్‌ ప్రాజెక్ట్‌ ల్లో కియారా?

Update: 2020-04-27 07:50 GMT
బాలీవుడ్‌ లో చిన్న హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ ప్రస్తుతం అక్కడ స్టార్‌ హీరోయిన్‌ గా బిజీ బిజీగా ఉంది. ఇదే సమయంలో ఈ అమ్మడు సౌత్‌ లో కూడా నటిస్తోంది. తెలుగులో ఈమె ఇప్పటికే భరత్‌ అనే నేను.. వినయ విధేయ రామ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ మద్య తెలుగులో ఈమెకు కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా బాలీవుడ్‌ లో బిజీగా ఉన్న కారణంగా నో చెప్పింది. ఎట్టకేలకు మళ్లీ తెలుగులో కియారా అద్వానీ బిజీ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగులో ఈ అమ్మడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల కోసం ఈమెను సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో మొదటిది ఎన్టీఆర్‌ 30 చిత్రం కోసం త్రివిక్రమ్‌ ఈమెను పరిశీలిస్తున్నాడట. ఆ తర్వాత ప్రభాస్‌ 21వ చిత్రం కోసం నాగ్‌ అశ్విన్‌ కూడా ఈమెతో సంప్రదింపులు జరిపాడని వార్తలు వచ్చాయి. ఇక చివరిగా మహేష్‌ బాబు మరోసారి ఈమెతో తన 27వ చిత్రంలో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది.

బాలీవుడ్‌ లో ఈ అమ్మడి కెరీర్‌ కాస్త స్లో అయిన కారణంగా టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేసేందుకు ఓకే అనే అవకాశం ఉందట. అందుకే ఈమెను టాలీవుడ్‌ మేకర్స్‌ సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న కారణంగా వచ్చే ఏడాదికి ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించగా ఒకటి సూపర్‌ హిట్‌ మరోటి ఫ్లాప్‌ అయ్యాయి. మరి ఈ మూడు సినిమాల పరిస్థితి ఏంటో..!
Tags:    

Similar News