• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: భయం లేని...

ట్రైలర్ టాక్: భయం లేని కవచం

By - Tupaki Desk
Update: 2018-11-12 10:07 GMT
తన సినిమాల్లో భారీతనం ఏ మాత్రం తగ్గకుండా హీరోయిజం ఎలివేట్ చేసే సినిమాల ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా కవచం టీజర్ విడుదలైంది. ఇప్పటిదాకా కథ ఎలాంటిదైనా ప్రేమికుడిగానే అలరిస్తూ వచ్చిన సాయి శ్రీనివాస్ మొదటి సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం ఎత్తాడు. స్టోరీ లైన్ చూచాయగా నిమిషంన్నరలోనే క్లూ ఇచ్చేసారు. నగరంలో ఉండే రాణి లాంటి హీరోయిన్ కు పెద్ద ఆపద పొంచి ఉంటుంది. తనను కాపాడే కర్తవ్యంతో రంగంలోకి దిగుతాడు ఓ సైనికుడి లాంటి పోలీస్. అతనే కథానాయకుడు. ఎందుకు యువరాణికి గండం పొంచి ఉంది విలన్లు ఎందుకు తన వెంట పడుతున్నారు కవచంలా అడ్డు నిలిచినా కూడా హీరో ఎదురుకున్న సవాళ్లు ఏంటి లాంటి అంశాలతో దర్శకుడు శ్రీనివాస్ యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని మలిచినట్టు కనిపిస్తోంది.

సాయి శ్రీనివాస్ పోలీస్ యుని ఫార్మ్ లో కొత్తగా ఉన్నాడు. భయపడే వాడికి భయపెట్టేవాడికి మధ్యలో కవచంలో ఉండేవాడే పోలీస్ అంటూ చెప్పిన డైలాగ్ పేలింది. కాకపోతే టీజర్ లో మొదట చెప్పిన రాణి కాజలా లేక మెహ్రీనా అనే సస్పెన్స్ కు మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. థమన్ బ్యాక్ గ్రౌండ్  స్కోర్ ఎప్పటిలాగే పవర్ మోడ్ లో ఉండగా చోటా కె నాయుడు ఛాయాగ్రహణంలో ఆయన అనుభవం కనిపిస్తోంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన కవచం ద్వారా దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని కొత్తగా చూపించే ప్రయత్నం అయితే మంచి ఫలితాన్ని ఇచ్చేలా ఉంది. డేట్ ఫిక్స్ చేయపోయినా డిసెంబర్ విడుదల అని క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి కవచం ఎలా కాపాడుతుందో చూడాలంటే వచ్చే నెల దాకా ఆగాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    
  • Bellamkonda Srinivas 
  • Kajal Agarwal 
  • Kavacham Teaser 
  • Kavacham Movie Teaser 
  • Bellamkonda Srinivas Kavacham Teaser 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS