ఇల్లు కొనే ప్లాన్స్ పక్కనెట్టేసిన హాటీ

Update: 2016-08-27 09:30 GMT
పాపం ఒక్క బ్రేకప్ ఆమె జీవితపు ప్లాన్స్ ను ఫరెవర్ మార్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కత్తిలాంటి అందాల కత్రినా కైఫ్‌ అసలు తన ఫ్యూచర్ ఎలా ప్లాను చేసుకోవాలి అనే సందిగ్దంలో పడిపోయింది. రణబీర్ కపూర్ తో ప్రేమాయణం వికటించిన తరువాత.. కత్తి చేసే ప్రతీ ప్లానులోనూ అనేక మార్పులు వచ్చేస్తున్నాయి.

గతంలో రణబీర్ అండ్ కత్రినా ఇద్దరూ కలసి ఒక అపార్టెమెంటును కోట్లు ఖర్చుపెట్టి ఎంతో గ్రాండ్ గా డిజైన్ చేసుకున్నారు. అయితే ఇద్దరికీ మధ్య చెడిన తరువాత.. రణబీర్ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు. కత్రినా మాత్రం ఇంకా అక్కడే ఉంటోంది. అయితే ఆ మధ్యన ముంబయ్ లో ఒక భారీ బంగ్లా కొనుక్కోవాలని ప్లాన్ చేసింది కత్రినా. కాని ఇప్పుడు ముంబయ్ కేవలం తన వర్కు ప్లేస్ అంతే. తనేమీ ఇక్కడే సెటిలవ్వదు. ఎప్పటికైనా తిరిగి లండన్ వెళిపోవాల్సిందే అని డిసైడ్ చేసుకుందట ఈ బ్రిటీష్‌ దేశస్తురాలు. అందుకే ముంబయ్ లో ఇల్లు కొనే ప్లాన్స్ అన్నీ డ్రాప్ చేసేసుకుంది.

ఇప్పుడు కత్రినా లుక్ అంతా.. హాలీవుడ్ మీదనే పడినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బ్రిటీష్‌ సినిమాల ఏజెంట్లను.. అలాగే లాస్ ఏంజెలిస్ లో ఉండే ఏజెంట్లను సంప్రదించి.. ఇంగ్లీషు సినిమాల్లో అవకాశాలు పట్టే పనిలో ఉంది. ఒకవేళ ఏదన్నా సెట్టయితో.. అయితే లండన్ కో లేదంటే న్యూ యార్క్ కో మకాం మర్చేయాలనేది అమ్మడి ప్లాన్.
Tags:    

Similar News