• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ ఆఫర్ తో అఖిల్ ఎక్కడికో...

ఈ ఆఫర్ తో అఖిల్ ఎక్కడికో వెళ్లిపోతాడు..!

By - Tupaki Desk
Update: 2018-08-27 10:34 GMT
అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా నాగార్జున గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ అగ్రహీరోగా ఎదిగారు. కానీ ఆయన వారసులు మాత్రం ఇప్పటికీ హిట్స్ కోసం ఆపసోపాలు పడుతూనే ఉన్నారు. చిన్న కుమారుడు అఖిల్ పై  నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన తొలిచిత్రం ‘అఖిల్’ డిజాస్టర్ అయ్యింది. ఇక రెండో మూవీ ఫేమస్ డైరెక్టర్ తో తీసినా అది అంచనాలను అందుకోలేకపోయింది. టాలీవుడ్ లో అఖిల్ ఎంట్రీ అనుకున్నట్టు జరగలేదని అక్కినేని ఫ్యామిలీ నిరాశలో ఉంది.

ప్రస్తుతం అఖిల్ ‘తొలిప్రేమ’ లాంటి ప్రేమకథా చిత్రాన్ని తీసి హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. తాజాగా అఖిల్ కు అదిరిపోయే అవకాశం వచ్చింది. కానీ అది టాలీవుడ్ నుంచి కాదు.. బాలీవుడ్ నుంచి.. ప్రఖ్యాత ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై కరుణ్ జోహర్ నిర్మాతగా.. సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో హీరోగా  అఖిల్ కు గోల్డెన్ చాన్స్ వచ్చింది.

కరణ్ జోహర్ ఎంతో మంది నటులను బాలీవుడ్ కు పరిచయం చేసి వారిని స్టార్ లుగా మలిచారు. ఆలియా భట్ - వరుణ్ ధావన్ - సిద్ధార్త్ లను కరణ్ లాంచ్ చేశారు. ఇటీవలే శ్రీదేవి కూతురు జాహ్నవిని కూడా కరణ్ జోహర్  పరిచయం చేశారు. ఇందులో ఆలియా భట్ ఇప్పుటు బాలీవుడ్ అగ్రహీరోయిన్ గా వెలుగొందుతోంది.

 అఖిల్ కు హిందీ సినిమా అవకాశం దక్కడం అతడి భవిష్యత్ కు ఎంతో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ అక్కడ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో ఫేమస్ హీరో అయ్యే గొప్ప చాన్స్  ఉంటుంది. టాలీవుడ్ లో ఫ్లాప్ అయిన అఖిల్ బాలీవుడ్ లోనైనా మెరవాలని అక్కినేని ఫ్యామిలీ గంపెడాశలు పెట్టుకుందట..
Tags:    
  • Karan Johar 
  • Dharma Productions 
  • Akhil 
  • Bollywood 

Similar News

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS