మూడు నెలల్లో రెండు సినిమాలు పూర్తి టార్గెట్
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు రాజకీయ నాయకుడిగా బిజీ అవుతున్నారు. ఆయన ఇప్పటికే పార్టీని ప్రారంభించాడు. వచ్చే ఏడాదిలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే అన్నట్లుగా పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల్లో ఆయన ఆత్మవిశ్వాసంను నింపుతున్నారు. తాజాగా ఆయన సినిమాలపై కూడా దృష్టి పెట్టాడంటూ సమాచారం అందుతోంది.
తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం భారతీయుడు సినిమాతో పాటు ఆయన ఇటీవల కమిట్ అయిన 'విక్రమ్' సినిమాను కూడా కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నాడు. మార్చి వరకు ఈ రెండు సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాడట. భారతీయుడు 2 సినిమాను పూర్తి చేయగలరా అనేది అనుమానంగా ఉంది. కాని విక్రమ్ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కనుక ఆయన ఈజీగానే ఈ సినిమాను పూర్తి చేస్తాడనే నమ్మకంను తమిళ ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారు. కమల్ పెట్టుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేనా అనేది చూడాలి.