లోకనాయకుడి డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఇక లేనట్టేనా?

Update: 2020-05-06 01:30 GMT
లోకనాయకుడు కమల్ హాసన్ తన నటనతో కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా దేశం వ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలు, ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని సందడి చేస్తూ ఉంటారు కమల్ హసన్. కాగా కరోనా నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా విధించబడిన లాక్‌ డౌన్‌ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో సినీ సెలబ్రెటీలు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. కరోనాపై అవగాహన కలిగించడమే కాకుండా.. పలు అంశాలపై తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల ప్రముఖ నటుడు లోకనాయకుడు కమల్‌ హాసన్‌ సోషల్‌ మీడియా ద్వారా లైవ్‌ లోకి వచ్చారు. హీరో విజయ్‌ సేతుపతితో కలిసి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు సినిమాలు, రాజకీయాలతోపాటుగా పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే విజయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు కమల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను కూడా వెల్లడించారు.

దాదాపు 90 నిమిషాలపాటు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. తమిళ సినిమాకు చెందిన ఇద్దరు సూపర్‌స్టార్‌లు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొనడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా విజయ్‌ నటనపై కమల్‌ ప్రశంసలు కురిపించారు. ‘నటుడిగా నేను నిన్ను చాలా ఇష్టపడతాను. కమర్షియల్‌ హంగుల వైపు వెళ్లకుండా మీరు స్క్రిప్టును నమ్ముకుంటారు. సక్సెస్‌ ఎప్పుడైనా వస్తుంది.. కానీ స్క్రిప్టును నమ్ముకుని మీరు చేసే ప్రయాణం ఎప్పటికీ వృథా కాదు’ అని పేర్కొన్నారు. నటించే ప్రతి పాత్రకు సంబంధించి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారని కమల్‌ ను విజయ్‌ ప్రశ్నించారు. దీనిపై కమల్‌ స్పందిస్తూ.. ‘నాకు దర్శకుడు కె బాలచందర్‌ మలయాళం సినిమా నటన గురించి నేర్పించాయి. మలయాళం ప్రజలు తమ అభిమాన నటులను విభిన్న పాత్రల్లో ప్రయోగం చేయడాన్ని ఇష్టపడతారు. కానీ తమిళనాడులో నటులను కొన్ని రకాల పాత్రల్లో చూడటానికి మాత్రమే ఇష్టపడతారు. చాలా కాలం తర్వాత నటనలో ప్రయోగాలు చేయాలనే కోరిక నీలో చూస్తున్నాను’ అని కమల్‌ చెప్పారు.

ఈ ఇంటర్వ్యూలతో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ను బయట పెట్టాడు కమల్‌. ఆహారం విషయంలో కంట్రోల్‌ చేసుకోలేనని.. నేను తినే తిండి గురించి నా కన్నా నా చుట్టు ఉన్న వాళ్లు బాగా చెప్తారు. అభయ్ సినిమాలో చేసిన పాత్ర కోసం భారీగా కండలు పెంచిన కమల్‌ ఆ సమయంలో రోజులో 32 గుడ్లు తినేవాడినని.. అదే సమయంలో మాంసా హారం కూడా ఎక్కువగా తీసుకున్నానని చెప్పాడు. అయితే అప్పడు ఎక్కువగా గుడ్లు తినటంతో వాటి మీద విరక్తి వచ్చి చాలా కాలం పాటు అసలు గుడ్లు తినటం మానేశానని చెప్పాడు. ఇక కమల్‌ డ్రీమ్ ప్రాజెక్ట్‌ మరుదనాయగం గురించి ప్రస్థావించాడు విజయ్‌ సేతుపతి. అయితే కమల్ ఆ సినిమా ఇప్పుడు కష్టమే అన్నట్టుగా సమాధానం ఇచ్చారు. 'అప్పట్లో నా వయసు 40 అందుకు తగ్గట్టుగా కథను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చేయాలంటే కథలో మార్పులు చేయాలి. లేదా మరో హీరోతో సినిమాను రూపొందించాలి. బడ్జెట్‌ కూడా చాలా ఎక్కువ అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News