• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అన్ స్టాపబుల్ కోసం కమల్...

అన్ స్టాపబుల్ కోసం కమల్ హాసన్.. ఎప్పుడంటే?

By - Tupaki Desk
Update: 2023-01-04 05:30 GMT
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఈ టాక్ షోలో పాల్గొనడానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. బాలయ్య బాబును కూడా ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని అర్థమైంది. ఇక జనాలు అయితే వారి అభిమాన హీరోలు అన్ స్టాపబుల్ లో పాల్గొంటే ఎగబడి చూసేందుకు కూడా రెడీ అవుతున్నారు.

ఇటీవల ప్రభాస్ రాకతో హడావిడి ఏ రేంజ్ లో కనిపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయిపోయేంతగా జనాలు ఎగబడి పోయారు. ఇక రాబోయే రోజుల్లో మరి కొంతమంది అగ్ర హీరోలుకి వస్తారు అని తెలుస్తోంది. ఇక మొత్తానికి ప్రభాస్ ఎపిసోడ్ అయితే అన్ స్టాపబుల్ రేంజ్ ను మరింతగా పెంచేసింది.

మొదటి భాగానికి ఇప్పుడే అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ కూడా రాగా రెండో భాగాన్ని ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ మధ్యలో బాలయ్య బాబు విరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా అదే రోజు చిత్ర యూనిట్ సభ్యులకు సంబంధించిన ఎపిసోడ్ ను తీసుకురావాలి అని డిసైడ్ అయ్యారు.

దీంతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సంక్రాంతి తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ షోలోకి కమల్ హాసన్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ అన్ స్టాపబుల్ షోలోకి వస్తుండగా తండ్రి కమలహాసన్ కూడా సందడి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా కమల్ హాసన్ తో బాలయ్య బాబుకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.

గతంలో వీరిద్దరూ కలిసి సినిమాలు కూడా చేయాలని అనుకున్నారు కానీ అనుకున్న తరహాలో ప్రాజెక్టులు సెట్ కాలేదు. అయితే మళ్లీ చాలా కాలం తర్వాత కమల్ హాసన్ కూడా తెలుగులో విక్రమ్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక మరింత ఫోకస్ అయ్యేందుకు బాలయ్య బాబు షోలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Unstoppable 
  • BalaKrishna 
  • Host 
  • LatestNews. VeeraSimhaReddy 
  • ShrutiHassan 
  • KamalHassan 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS