ఇంతకీ మెయిన్‌ హీరోయిన్‌ ఎవరు?

Update: 2015-07-01 11:45 GMT
ఫస్ట్‌ లీడ్‌, సెకండ్‌ లీడ్‌, థర్డ్‌ లీడ్‌.. ఇలాంటివి ఇక్కడే వినిపిస్తాయి. అదే హాలీవుడ్‌ వెళితే అస్సలు పట్టించుకోరు! పలు సందర్భాల్లో ఎంతోమంది కథానాయికలు జర్నలిస్టులపై ఫైరైన సందర్భం ఉంది. ప్రస్తుతం మహేష్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మూెత్సవం ఇదే విషయంలో  చర్చల్లోకొచ్చింది.

ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు మహేష్‌తో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు. మహేష్‌ నాయికగా రకూల్‌ పేరు తొలినుంచీ ప్రచారంలో ఉంది.  మిగతా నాయికలుగా సమంత, ప్రణీత ఎంపికయ్యారని ప్రచారం సాగింది. అయితే ఇంతలోనే రకూల్‌ని రీప్లేస్‌ చేస్తూ కాజల్‌కి అవకాశమిచ్చారు. కాల్షీట్లు సర్ధుబాటు చేయలేక రకూల్‌ స్వయంగా తప్పుకుంది. అయితే కాజల్‌ ఎంట్రీ రకరకాల సందేహాల్ని రెయిజ్‌ చేసింది. రకూల్‌ లేనప్పుడు కాజల్‌ స్థానం ఏంటి? మొదటి నాయికగానా? లేక రెండో నాయికగానా? ఇదే ప్రశ్న సమంత విషయంలోనూ తలెత్తింది. కాజల్‌, సమంత ఒకటి, రెండు స్థానాల్లో ఏ పొజిషన్‌లో నటిస్తారు? అన్న ప్రశ్న వస్తోంది.

ఒకవేళ ఈ చిత్రంలో ఎవరు ఏ స్థానంలో నటించాల్సి వచ్చినా ఈ భామల మధ్య సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఈగో సమస్య తలెత్తదు. సమంత, ప్రణీత ఇప్పటికే కలిసి నటించారు .. కాబట్టి ఆ ఇద్దరికీ సమస్య రాదు. కాజల్‌, సమంత ఇద్దరూ బృందావనంలో కలిసి నటించారు. కాబట్టి చాలా వరకూ ఈగో క్లాషెస్‌కి ఆస్కారం లేదు. త్వరలోనే శ్రీకాంత్‌ అడ్డాల వీటన్నిటికీ సమాధానం చెబుతారేమో చూడాలి.

Tags:    

Similar News