హనీమూన్ కు వెళ్లి ఎంజాయ్ చేయక.. ఈ ఫోటో షూటులేంది?

Update: 2020-11-12 04:45 GMT
సెలబ్రిటీల తీరు మారింది. తమను తాము మార్కెటింగ్ చేసుకోవటం ఎక్కువైంది. తమకున్న పాపులార్టీని పెంచుకోవటానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం.. తమకు సంబంధించిన అంశాల్ని షేర్ చేసుకోవటం లాంటివి చేస్తుంటారు. అయితే.. సెలబ్రిటీలు పెట్టే పోస్టుల్ని జాగ్రత్తగా గమనిస్తే.. ప్రతి పోస్టు వెనుక ఒక అర్థం.. పరమార్థం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. ఎక్కడిదాకానో ఎందుకు? టాలీవుడ్ చందమామ అక్టోబరు 30న సుదీర్ఘమైన తన లవ్ ట్రాక్ కు పుల్ స్టాప్ పెట్టేసి.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

తన పెళ్లి గురించి.. వివాహనంతర విశేషాలకు సంబంధించిన ఫోటోల్ని తెగ షేర్ చేస్తున్న ఈ బ్యూటీ.. తన లవ్ ట్రాక్ గురించి.. ఎప్పుడైనా పెదవి విప్పిందా? అంతా అయిపోయాక.. పెళ్లికి కాస్త ముందుగా రివీల్ చేసింది. భర్త  గౌతమ్ తో కలిసి తాజాగా హనీమూన్ ట్రిప్ లో ఉన్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు తన హనీమూన్ ఫోటోల్ని షేర్ చేసుకుంటోంది.

అయినా.. వెళ్లింది హనీమూన్ కు వెళ్లినప్పుడు.. ఎంచక్కా ఎంజాయ్ చేయక.. తన గ్లామర్ ను.. తనకెంత ఫిట్ నెస్ ఉందన్న విషయాన్ని తెలియజేసే ఫోటోల్ని పోస్టు చేయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. అయినా.. కొత్త కఫుల్ కలిసి సరదగా హనీమూన్ ట్రిప్ కు వెళ్లినప్పుడు.. వెంట ఫోటో గ్రాఫర్ ను కూడా తీసుకెళ్లారా?

లేకుంటే.. ఇన్ని ఫోటోలు ఎలా సాధ్యం? అయినా.. ఇలాంటి ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ లు ఎప్పుడైనా చేసుకోవచ్చు చందమామ. ముందు.. లైఫ్ ను ఎంజాయ్ చేయక.. ఈ సోషల్ మీడియా పోస్టులేందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. కాజోల్ పోస్ట్ చేసిన ఫోటోల్లో క్యూట్ గా ఉండటమే కాదు.. తన బాడీకున్న ఫ్లెక్సిబిలిటీని చాటి చెప్పే ఫోటోల్ని పోస్టు చేయటం గమనార్హం.
Tags:    

Similar News