అమ్మడు హనీమూన్ డెస్టినేషన్ల ఆరా తీస్తోందట!!

Update: 2020-05-27 09:45 GMT
ప్రపంచాన్ని మహమ్మారి పీడిస్తుంటే టాలీవుడ్ ను మాత్రం మ్యారేజ్ ఫీవర్ గట్టిగా తగులుకుందని తెగ జోకులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోలు పెళ్లి బాట పట్టారు. సింగిల్.. సింగిల్ అంటూనే మింగిల్ అవుతున్నారు. ఎంతసేపూ హీరోలనే పెళ్లి సంగతి అడుగుతూ వారి ప్రాణం తోడేస్తుంటారు కానీ కొందరు టాలీవుడ్ భామలు ఇప్పటికే ముప్పైలు దాటి ముప్పై ఐదుకు అరడుగు అటూ ఇటుగా ఉన్నారు. మరి ఈ భామలు పెళ్లి చేసుకోరా?

ఈ లిస్టు చాలా పెద్దదే.  అనుష్క వయసు 38... త్రిష 38..  కాజల్ అగర్వాల్ 34.  ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే గూడ్సు బండి అంత పొడవుగా వస్తూనే ఉంటుంది.. ఈ హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడి జీవితంలో స్థిరపడతారు అని చాలామందికి అనుమానం.  మిగతావారి సంగతేమో కానీ కాజల్ మాత్రం త్వరలో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. ఈమధ్య కాజల్ తన సన్నిహతుల దగ్గర 'మంచి హనీమూన్ డెస్టినేషన్లు ఉంటే చెప్పండి' అని ఆరా తీస్తోందట.  దీంతో  ఈ చందమామ ఎవరితోనైనా డేటింగ్ లో ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అంతే కాదు.. పెళ్లి ప్రకటన చేసే ముందు జనాలను సన్నద్ధం చేసే సన్నాహాలలో భాగంగా ఇలాంటి హింట్స్ ఇస్తోందేమోనని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ భామ త్వరలో పారిస్ వెళ్లేందుకు సన్నాహాలు కూడా చేసుకుంటోందట. మరి ఈ పారిస్ ట్రిప్ కు ఆ హానీమూన్ ట్రిప్ కు లింక్ ఉందా? లేక అది వేరే ఇది వేరేనా? సరే ఇవన్నీ పక్కన పెడితే దేశంలో పరిస్థితులు మెల్లగా సాధారణ స్థితికి వస్తున్నాయి.. అందుకే త్వరలో ఏదో ఓ ప్రకటన చెయ్యబోతోందని అంటున్నారు. మరి ఆ ప్రకటన గురించి తెలియాలంటే మాత్రం వేచి చూడకతప్పదు.
Tags:    

Similar News