కాజల్ కి కండబలం కూడా ఎక్కువే..

Update: 2016-02-05 17:30 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ ఈ మధ్య ప్రతీ విషయానికి చాలా త్వరగా స్పందిస్తోంది. గతంలో మాదిరిగా లేట్ చేయకుండా.. ప్రతీ అంశానికీ తన చేష్టలతోనే ఆన్సర్ ఇస్తోంది. బాగా ఒళ్లు చేయడంతో కొన్నాళ్ల క్రితం కాజల్ పై బోలెడు విమర్శలొచ్చాయి. ఛాన్సులు లేక ఇక సినిమాలపై ఆశలు వదిలేసుకుందనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇంతలోనే సరైన వర్కవుట్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది.

చాలా తక్కువ సమయంలోనే స్లిమ్ గా మారిపోయింది. ఈ మార్పు కేవలం బాడీ వరకే లిమిట్ చేయకుండా... బాడీని ప్రదర్శించడంలో లిమిట్స్ పైనా దృష్టి పెట్టింది. గతంలో పెట్టిన బార్డర్స్ ను తొలగించి, ఓపెన్ షో చేస్తోంది కాజల్. ముంపై లో జరిగిన ఫిలిం ఫేర్ ఫంక్షన్ లో క్లీవేజ్ షోతో అందరినీ కంగారు పెట్టించేసిన కాజల్.. తర్వాత కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేసేసింది. లిప్పు కిస్సుల వరకూ వెళ్లిన వ్యవహారం ఇఫ్పుడు కండలు చూపించే స్టేజ్ కి వచ్చింది. రీసెంట్ గా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది ఈ చందమామ.

వెనక్కి తిరిగి వీపు భాగాన్ని అందంగా ఎగ్జిబిట్ చేయడమే కాకుండా.. బైసెప్స్ చూపిస్తూ ఓ పోజ్ కూడా ఇచ్చింది. తన కండబలం చూడమంటూ టీజ్ చేయడమే కాదు.. స్ట్రాంగ్ గా ఉండమంటూ ఓ సలహా కూడా ఇఛ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ - మహేష్ లతో ఆఫర్లు, తమిళ్ లో విజయ్, విక్రంలతో ఛాన్సులు.. బాలీవుడ్ లో రిలీజ్ కి సిద్ధమైన సినిమా.. అన్నీ కలిపి కాజల్ కేరక్టర్ ని బాగా స్ట్రాంగ్ చేసేశాయి. అందుకే ఇంతకు ముందులా కాకుండా.. ఇప్పుడు తెగ సలహాలు కూడా ఇచ్చేస్తోంది.
Tags:    

Similar News