హీరో శ్రీ‌కాంత్ చేతుల మీదుగా.. బాబాయ్‌ హోటల్ లాంచ్‌

బాబాయి హోటల్ 2022లో హైదరాబాద్ లో ప్రారంభ‌మైంది. గత నెలలో మాదాపూర్‌లో కొత్త శాఖను ప్రారంభించారు

Update: 2024-04-27 12:59 GMT

బాబాయ్ హోటల్ తెలుగు రాష్ట్రాల్లోని భోజన ప్రియులకు ప్ర‌త్యేక‌ నిలయంగా ఉంది. క‌స్ట‌మ‌ర్ అభిరుచి మేర‌కు సంతృప్తిపరిచేందుకు వివిధ రకాల వంటకాలను అందిస్తోంది. ఈ ఐకానిక్ రెస్టారెంట్ విస్తరణ డ్రైవ్‌లో ఉంది. బాబాయి హోటల్ 2022లో హైదరాబాద్ లో ప్రారంభ‌మైంది. గత నెలలో మాదాపూర్‌లో కొత్త శాఖను ప్రారంభించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో తమ మూడో శాఖను ప్రారంభించారు.

హైదరాబాద్ లింగంపల్లిలోని నల్లగండ్లలో ఇప్పుడు బాబాయి హోటల్ సేవ‌లందిస్తోంది. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు, ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నాణ్య‌మైన రుచిక‌ర‌మైన ఆహారాన్ని అందించే హోట‌ళ్ల‌కు జ‌నాద‌ర‌ణ పుష్క‌లంగా ఉంటుంద‌ని బాబాయ్ హోట‌ల్ ప్ర‌స్థానం వెన‌క ఇవ‌న్నీ కార‌ణాల‌ని హీరో శ్రీ‌కాంత్ అన్నారు.

శ్రీ‌కాంత్ స‌హా బాబాయ్ హోటల్ నిర్వాహకులు- కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి త‌దిత‌రులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన శాఖను ప్రారంభించడంపై యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తూ.. నల్లగండ్ల శాఖ ప్రారంభోత్సవంలో పాల్గొన్న హీరో శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News