తారక్ మాటకు బాలయ్య ఎస్ అంటాడా?
ఎన్టీఆర్ బయోపిక్ తాలుకు అప్ డేట్స్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పోస్టర్లు వర్కింగ్ స్టిల్స్ ఆన్ సెట్ పిక్స్ ఇలా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా విశేషాలు బయటికి వస్తుండటంతో వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇటీవలే సక్సెస్ మీట్ జరిగిన సందర్భంగా బాలయ్య ముఖ్య అతిదిగా రావడం సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఆ సందర్భంగానే తారక్ అందులో బాలయ్య పాత్రలో ఎన్టీఆర్ కొడుగ్గా నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దానికి సమర్ధన రాలేదు ఖండనా చెప్పలేదు. సో అది అలాగే ఉండిపోయింది.
మరోవైపు మోక్షజ్ఞ ఇది చేస్తాడు అనే టాక్ కూడా ఉంది కాని క్రిష్ ఏదీ బయటికి తెలియనివ్వడం లేదు. ఈ సస్పెన్స్ మరికొద్ది రోజులు తప్పేలా లేదు. మరోవైపు జూనియర్ ఇందులో వాయిస్ ఓవర్ చెప్పబోతున్నట్టు మరో న్యూస్ హల్చల్ చేస్తోంది. నిజానికి ఈ ప్రతిపాదన బాలయ్య వద్దకు క్రిష్ తీసుకెళ్లాడట. ఎలాగూ నందమూరి హీరోలు ఏదో ఒక రూపంలో ఇందులో భాగమయ్యారు కానీ తారక్ ని ఈ రకంగా వాడుకుంటే బ్యాక్ గ్రౌండ్ లో తన గొంతు రూపంలో మంచి ఎలివేషన్ వస్తుందని చెప్పినట్టు సమాచారం. బాలకృష్ణ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఆలోచనలో పడ్డట్టు సన్నిహితులు చెబుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ లో భాగం అవుతాడా లేదా అనే సస్పెన్స్ ఇంకొద్ది రోజులు కొనసాగనుంది.