జాన్వీ Vs ఖుషీ.. అక్క మ‌యూర నాట్యం చెల్లి ప‌ట్టించుకోదేం?

Update: 2020-12-06 11:17 GMT
డ్యాన్స్ అంటే జాన్వీ క‌పూర్ కి ఎంత‌టి ప్రేమో చెప్పాల్సిన ప‌నే లేదు. త‌న డ్యాన్సింగ్ వీడియోలను తరచూ పోస్ట్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో  ఉంటుంది. తాజాగా ఆదివారం మధ్యాహ్నం తన ఇన్ స్టాగ్రామ్ లో మ‌రో డ్యాన్సింగ్ వీడియోని జోడించింది. ఈ వీడియోలో పసుపు సల్వార్-కుర్తా ధరించిన జాన్వి..  ఆయుష్మాన్ ఖుర్రానా - భూమి పెడ్నేకర్ న‌టించిన‌ 2017 చిత్రం శుభ మంగల్ సావ్ ధాన్ నుండి కన్హా మనే నా ట్రాక్ కు డ్యాన్స్ చేస్తోంది.

జాన్వీ హార్ట్ ట‌చింగ్ స్టైల్లో డ్యాన్స్ చేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. త‌న‌ సోదరి ఖుషీ కపూర్ మాత్రం ఇదేమీ ప‌ట్ట‌న‌ట్టు తన ఫోన్ లో  బిజీగా ఉంది. జాన్వి ఈ పోస్ట్ కి ఎంతో ఉల్లాసం క‌లిగించే శీర్షికను నిర్ణ‌యించింది. ``మీరు నా సోదరి కంటే ఎక్కువ ఆస్వాధిస్తార‌ని ఆశిస్తున్నాను. బూబూ ఇది చూడటానికి స్వైప్ చేయండి`` అంటూ జాన్వి అభిమానులను టీజ్ చేసింది. సో క్యూట్ అంటూ అభిమానులు రిప్ల‌య్ ఇచ్చారు.

జాన్వి కపూర్ సోదరి ఖుషీ కపూర్ క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసేందుకు స‌న్నాహ‌కాల్లోనే ఉంది. ఇటీవ‌ల న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిప్లోమా జాయినైన సంగ‌తి తెలిసిన‌దే. ఖుషి తన సోదరి ఇన్ ‌స్టాగ్రామ్ ప్రొఫైల్  ‌లో తరచూ కనిపిస్తుంది.

కెరీర్ పరంగా.. జాన్వి కపూర్ ఇటీవల `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` చిత్రంలో నటించారు. ఇది స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 12 న విడుదలైంది. ఈ చిత్రం సినీ విమర్శకుల నుండి మంచి సమీక్షలను అందుకుంది. నెట్ ‌ఫ్లిక్స్ యొక్క ఘోస్ట్ స్టోరీస్ ‌లోనూ జాన్వీ ఒక భాగం.  కరణ్ జోహార్ పీరియడ్ డ్రామా తఖ్త్,... హర్రర్ కామెడీ రూహి అఫ్జా,.. రాజ్ ‌కుమార్‌ రావు- కార్తీక్ ఆర్యన్ స‌ర‌స‌న దోస్తానా 2 చిత్రీక‌ర‌ణ‌లో ఉన్నాయి.

Full View
Tags:    

Similar News