• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగపతి ఆ సినిమాలోనూ...

జగపతి ఆ సినిమాలోనూ చేస్తున్నాడా?

By - Tupaki Desk
Update: 2016-01-13 04:36 GMT
లెజెండ్.. జగపతి బాబు కెరీర్ ను గొప్ప మలుపు తిప్పిన మాట వాస్తవమే కానీ.. అతడిలో మంచి క్యారెక్టర్ నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసిన సినిమా మాత్రం ‘అనుకోకుండా ఒకరోజు’నే అని చెప్పాలి. ఆ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసి.. తన ప్రత్యేకతను చూపించాడు జగపతి. ఇప్పటికీ ఆ సినిమా చూసినా.. అందులో ఆయన పాత్ర గుర్తొచ్చినా జనాలకు మంచి ఫీలింగ్ కలుగుతుంది. జగపతి విలన్ క్యారెక్టర్ వేసే సాహసం చేయడానికి ఒకరకంగా ఆ పాత్ర స్ఫూర్తి ఇచ్చిందని చెప్పాలి. జగపతికి అప్పుడంత మంచి పాత్ర ఇచ్చిన విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. మరోసారి ఆయన కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా డిజైన్ చేశాడా అని సందేహం కలుగుతోంది ట్విట్టర్లో జగపతి బాబు షేర్ చేసిన ఓ ఫొటో చూస్తే.

‘సాహసం’ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న యేలేటి.. మోహన్ లాల్, గౌతమి, ఇర్ఫాన్ ఖాన్ లాంటి విలక్షణ నటీనటులతో ఓ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం సైలెంటుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఐతే సినిమాలో జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు ఇప్పటికైతే సమాచారం లేదు. ఐతే మోహన్ లాల్, యేలేటిలతో కలిసి దిగిన ఫొటోను జగపతి షేర్ చేశాడు. ఈ సినిమాతో ఏ సంబంధం లేకుండా ఆ షూటింగ్ స్పాట్ కు అతను ఎందుకు వెళ్లి ఉంటాడన్నది సందేహం. బహుశా జగపతి కూడా అందులో ఓ క్యారెక్టర్ చేస్తున్నాడేమో. అదే నిజమైతే ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ రావడం ఖాయం.
Tags:    
  • Jagapathi Babu 
  • Mohan lal 
  • Telugu NEws 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS