• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగపతి లాయర్.. అతను...

జగపతి లాయర్.. అతను డైరెక్టర్

By - Tupaki Desk
Update: 2018-01-04 05:39 GMT
కెరీర్ ఆరంభం నుంచి భిన్నమైన పాత్రలు.. భిన్నమైన సినిమాలతో సాగిపోతున్నాడు నారా రోహిత్. స్టార్ ఇమేజ్ కోసం వెంపర్లాడకుండా కథల్ని నమ్మి విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడతను. వేరే హీరోలతో కలిసి తెరను పంచుకోవడానికి ఎన్నడూ వెనుకాడలేదు. మల్టీస్టారర్లు చేశాడు. వేరే హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించాడు. ఇప్పుడు సీనియర్ నటుడు జగపతిబాబు కాంబినేషన్లో ‘ఆటగాళ్ళు’ అనే సినిమాలో నటిస్తున్నాడు రోహిత్. ఈ చిత్రంలో రోహిత్.. జగపతి.. ఈ ఇద్దరి పాత్రలూ చాలా భిన్నంగా.. పవర్ ఫుల్ గా ఉంటాయట. జగపతి బాబు ఇందులో లాయర్ క్యారెక్టర్ చేస్తాడన్న సమాచారం ఇప్పటికే బయటికి వచ్చింది.

ఇప్పుడు రోహిత్ పాత్ర గురించి కూడా హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలో రోహిత్ సినిమా డైరెక్టర్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. లాయర్-డైరెక్టర్ మధ్య వైరం.. ఎత్తులు పై ఎత్తుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. అందుకే ‘ఆటగాళ్ళు’ అనే టైటిల్ పెట్టారట ఈ చిత్రానికి. ‘నీకోసం’.. ‘పెదబాబు’.. ‘ఆంధ్రుడు’ సినిమాల ఫేమ్ పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అధినాయకుడు’తో ఎదురు దెబ్బ తిన్నాక చాలా ఏళ్ల విరామం తీసుకుని.. ఎంతో కసరత్తు చేసి ఈ కథను సిద్ధం చేసుకున్నాడు మురళి. మరి అతడికి.. రోహిత్-జగపతిబాబులకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Tags:    
  • Jagapathi Babu 
  • Nara Rohith 
  • Aatagallu movie 

Similar News

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS