14 ఏళ్లకే లిప్ లాక్ టేస్ట్ చేసేసింది

Update: 2017-02-21 08:42 GMT
శ్రీలంక సోయగం జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిపోతోంది. ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు విడుదల అయిపోతున్నాయంటే.. జాకీ స్పీడ్ ఏంటో అర్ధమవుతుంది. అన్నీ క్రేజీ ప్రాజెక్టులే కావడం.. సినిమాలు ఒడిసి పట్టుకోవడంలో అమ్మడి ట్యాలెంట్ ను చాటి చెబుతుంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఏ రేంజ్ స్పీడ్ అనే విషయాన్ని చెప్పింది జాక్వెలిన్. ఈ భామకు మొదటి ముద్దు అనుభవం.. అది కూడా మూతి ముద్దుల అనుభవం ఎప్పుడో తెలుసా? 14 ఏళ్లకే తాను ఫస్ట్ లిక్ లాక్ లాగించేశానని ధైర్యంగా చెప్పేసింది జాకీ. ఆ వయసులోనే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. స్కూల్ డేస్ లో 3 సంవత్సరాలపాటు బాయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణం సాగించానని చెప్పింది జాక్వెలిన్. ఆ తర్వాత మాత్రం అబ్బాయిలకు కుర్రాళ్లకు కాస్త దూరం పాటించడం మొదలుపెట్టిందట.

ప్రస్తుతం సిద్ధార్ధ మల్హోత్రాతో జాక్వెలిన్ నటించిన రీలోడెడ్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. ఈ మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు నాగార్జున నటించిన టాలీవుడ్ మూవీకి హిందీ రీమేక్ అయిన జుడ్వాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జుడ్వా2లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News