• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్యాచిలర్ సెకండాఫ్ సీన్స్...

బ్యాచిలర్ సెకండాఫ్ సీన్స్ రీ షూట్ చేస్తున్నారా...?

By - Tupaki Desk
Update: 2020-10-30 08:10 GMT
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్''. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అఖిల్ కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఆకట్టుకున్నాయి. అలానే గోపీ సుందర్ స్వరపరిచిన 'మనసా మనసా' లిరికల్ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్ లో సెకండాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' సెకండాఫ్ లో కొన్ని సీన్స్ డౌట్ గా ఉండటంతో మళ్ళీ రీ షూట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ చిత్రంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్న అఖిల్ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    
  • Most Eligible Bachelor 
  • Akhil Akkineni Latest Movies 
  • Most Eligible Bachelor 
  • Meb Poster 
  • Most Eligible Bachelor Release Date 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS