తనకు కరోనా రాలేదన్న స్టార్ నటుడు
ఈమద్య కాలంలో సినీ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడ్డారు. ఇంకా కరోనాతో పోరాటం చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కరోనా పాజిటివ్ అంటూ కొందరికి నిర్థారణ అయినా కూడా బయటకు చెప్పడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తమిళ నటుడు ప్రభు కరోనా బారిన పడ్డట్లుగా తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈనెల 1వ తారీకున జరిగిన తండ్రి లెజెండ్రీ నటుడు శివాజీ గణేశన్ జయంతి కార్యక్రమంలో ప్రభు పాల్గొనలేదు. దాంతో అంతా కూడా ప్రభుకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని భావించారు.
ప్రభుత్వం నిర్వహించిన శివాజీ గణేశన్ జయంతి వేడుకలో ఆయన తనయుడు పాల్గొనకపోవడంతో పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేయడంతో కరోనా అనుకున్నారు. కాని ఆయన తనకు కరోనా అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. తనకు కాలు బెనకడం వల్ల ఆసుపత్రికి వెళ్లాను. అందుకే నేను నాన్న గారి జయంతి వేడుకలో పాల్గొనలేక పోయాను. అంతే తప్ప నాకు కరోనా ఏమీ లేదని తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. దాంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.