బయోపిక్ లో రణ్వీర్ కాదు ఆమిర్

Update: 2018-03-28 10:54 GMT
ఇటు టాలీవుడ్లోనే కాదు, అటు బాలీవుడ్లో కూడా బయోపిక్ ల హవా బాగానే నడుస్తోంది. కాకపోతే వాళ్ళు కొంచెం కొత్తగా బాబాల బయోపిక్ లు కూడా తీసేస్తున్నారు. ఓషో రజనీష్.. జీవితకాలంలో ఎక్కువ వివాదాల్లో ఇరుక్కున్న ఆధ్యాత్మిక నాయకుడు ఆయన. 1990 లో మరణించిన ఓషో గురించి తెలియని వారుండరు. చనిపోయి 2 దశాబ్దాలు దాటినా ఆయన కథ చాలామందికి తెలిసిందే. ఆయన జీవితం పైన ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరో సినిమా తీస్తున్నాడు.

ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరు కొత్త కథలను వెతికి మరీ సినిమా తీయడంలో దిట్ట, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఓషో బయోపిక్ కొత్త విషయం ఎం కాదు. ఎప్పటినుండో రుమర్ల రూపంలో బాలీవుడ్లో అందరి నోట్లో నానిన మ్యాటరే. కాకపోతే కరణ్ జోహార్ ఎనర్జిటిక్ యాక్టర్ రణ్వీర్ సింగ్ తో తీయబోతున్నాడు అని కథనాలు వెలువడ్డాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆమిర్ సినిమా చేస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. భగవాన్ శ్రీ రజనీష్ గా పిలవబడే ఓషో ను పన్ను కట్టనందువల్ల అమెరికా ప్రభుత్వం అక్కడినుండి తరిమేసింది.

అంతే కాదండోయ్.. ఈయన పైన సెక్స్ కల్ట్ నడుపుతున్నాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికే వైల్డ్ కంట్రీ అని ఓషో పైన ఒక డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఆ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఫాన్స్ కి వచ్చే డౌట్ ఏంటీ అంటే, సినిమా తీస్తాడు సరే కానీ, బీజేపీ హయాంలో ఆమిర్ కనీసం సినిమా ట్రైలర్ అయినా విడుదల చెయ్యగలరు అంటారా?
Tags:    

Similar News