క‌రోనా ఝ‌ల‌క్: జ‌క్క‌న్న‌కు మైన‌స్.. మ‌హేష్‌కి ప్ల‌స్?‌

Update: 2020-04-14 04:31 GMT
క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశంలో లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లంతా మాస్కులు ధ‌రించి సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ప్ర‌భుత్వం..డాక్ట‌ర్లు సూచిస్తున్న స‌ల‌హాల‌ను పాటిస్తున్నారు. అయినా వైర‌స్ ఇంకా అదుపులోకి రాలేదు. నేటి నుంచి మ‌రో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడింగ‌చే అవ‌కాశం ఉంది. దానిపై మ‌రికొన్ని గంట‌ల్లో క్లారిటీ రానుంది.  అయితే ద‌ర్శ‌కుడు రాజమౌళి మాత్రం  లాక్ డౌన్ అమ‌లులో ఉండ‌గానే  ఆర్ ఆర్ ఆర్ డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే డ‌బ్బై శాతానికి పైగా పూర్త‌యింది. షూటింగ్ ద‌శ‌లోనే విదేశాల్లో  గ్రాఫిక్స్ ప‌నులు కూడా చేసారు.

తాజాగా డ‌బ్బింగ్ ప‌నులు కూడా మొద‌లుపెట్టిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. లాక్ డౌన్ గ్యాప్ లో కావాల్సినంత స‌మ‌యం దొర‌క‌డంతో డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు పెట్టిన‌ట్లు చెబుతున్నారు. డ‌బ్బింగ్ లో హీరోలు రామ్ చ‌ర‌ణ్‌...ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారుట‌. ముందుగా వాళ్ల పాత్ర‌ల‌కు సంబంధించి షూటింగ్ పూర్త‌యిన వ‌ర‌కూ మొత్తం పూర్తి చేసేయాల‌ని చూస్తున్నారుట‌. అనంత‌రం మిగ‌తా న‌టులు డ‌బ్బింగ్ కు హాజ‌ర‌వుతార‌ని అంటున్నారు. దీంతో తార‌క్..చ‌ర‌ణ్ పై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. సామాజిక దూరం అని టీవీల్లో చెప్పిన హీరోలే ఇప్పుడిలా క‌లిసి ఎలా డ‌బ్బింగ్ చెబుతున్నారంటూ మండిప‌డుతున్నారు.

మ‌రోవైపు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాని అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేసి సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మేన‌ని భావిస్తున్న రాజ‌మౌళి స‌మ్మ‌ర్ రేస్ కి రీఎరేంజ్ చేసుకుంటున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌రోనా విసిరిన పంచ్ ఆర్.ఆర్.ఆర్ పై ఆ రేంజులో ప‌డింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక రాజ‌మౌళి సైడిచ్చేసినా .. 2021 సంక్రాంతిని క్యాచ్ చేయ‌డం మ‌హేష్ కి కుదురుతుందా?  ప‌ర‌శురామ్ అంత వేగంగా ఎంబీ 27 సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయ‌గ‌ల‌డా? అన్న చ‌ర్చా మొద‌లైంది.

సంక్రాంతి కుద‌ర‌క‌పోయినా స‌మ్మ‌ర్ కి రిలీజ్ చేయాల‌న్నా జ‌క్క‌న్న కొన్ని రూల్స్ ని బ్రేక్ చేయాల్సి వ‌స్తోంది. అయితే దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ లోనూ హీరోల్ని టెన్ష‌న్ పెడుతున్న రాజ‌మౌళి పై విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. సోష‌ల్ డిస్టెన్స్ ప్ర‌జ‌ల‌కేనా?  మీకు ఆ బాధ్య‌త లేదా? అంటూ స్టార్ల‌ను విమ‌ర్శిస్తున్నారు.ఇక ఆర్.ఆర్.ఆర్ హీరోల‌కు భిన్నంగా డార్లింగ్ ప్ర‌భాస్ మాత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి స‌సేమిరా అనేస్తుండ‌డం ఆసక్తిక‌రం. ఇటీవ‌లే జాన్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా యూవీ క్రియేష‌న్స్ ప్ర‌భాస్ తెలియ‌కుండా చేయ‌డం స్టార్ట్ చేసారు. ఈ విష‌యం ప్ర‌భాస్ కు తెలియ‌డంతో సిబ్బందికి ర‌క్ష‌ణ ఇవ్వాల‌న్న సంగ‌తి తెలియ‌దా?  అంటూ యూవీ నిర్మాత‌ల‌పై ప్ర‌భాస్ ఫైర్ అయ్యాడు. దీంతో తాత్కాలికంగా ఆ ప‌నుల‌ను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News