'ఆర్.ఆర్.ఆర్'లో రామ్ చరణ్ పోలీసైతే - మరి ఎన్టీఆర్ 'బందిపోటు దొంగా'..?

Update: 2020-04-04 10:50 GMT
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరు తో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో చరణ్ ని పోలీస్ గా పరిచయం చేసేశాడు దర్శకుడు రాజమౌళి. సీరియస్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ గా చరణ్ లుక్స్ కేక పుట్టించాయి. జస్ట్ నిమిషం నిడివిగల ఈ వీడియోలో గంభీరమైన ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోడవడం తో చరణ్ రోల్  వీర లెవల్లో ఎలివేట్ అయింది. చరణ్ రెండు మూడు గెటప్స్ లో కనిపించనుండగా అందులో ఈ పోలీస్ గెటప్ ఒకటని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రని ఎలా పరిచయం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న స్పెషల్ వీడియో 'రామరాజు ఫర్ భీమ్' రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రామ్ చరణ్ ని పోలీస్ గా చూపించి సక్సెస్ అయిన జక్కన్న ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నాడనేది ఇప్పుడు సగటు సినీ అభిమానికి మది లో ఉన్న ప్రశ్న. ఎన్టీఆర్ ని కూడా ఓ పవర్ ప్రొఫెషనల్ లో చూపిస్తాడా లేక కొమరం భీమ్ ఒరిజినల్ లుక్ లో చూపిస్తాడా అనేది చూడాలి. ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో ఆర్.ఆర్.ఆర్ లో కనిపిస్తాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఆసక్తి రేపుతోంది. అయితే ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వార్త షికారు చేస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పాత్రలో 'బందిపోటు దొంగ'లా కనిపించబోతున్నాడట. రామ్ చరణ్ పోలీసుగా కనిపించడంతో ఎన్టీఆర్ బందిపోటుగా కనిపిస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. మరి జక్కన్న ఎన్టీఆర్ ని బందిపోటులా పరిచయం చేయబోతున్నాడా..?, ఈ ఊహ బాగున్నప్పటికీ జక్కన్న మదిలో ఏముందో..ఎవరూ ఊహించనిది చేయడమే కదా జక్కన్న స్పెషాలిటీ. ఈ అనుమానాలన్నిటికి మే 20న సమాధానం దొరకనుంది అనుకుంటున్నారు సినీ అభిమానులు.
Tags:    

Similar News