ఎవరికైనా ఆ రికార్డులను బీట్ చేయడం కష్టం అనిపించాలి: విజయ్ దేవరకొండ

Update: 2021-06-02 15:30 GMT
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ టైమ్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించే 30 మంది 'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' జాబితాలో టాప్ ప్లేస్‌ లో నిలిచాడు. ఇప్పటికే 2018 - 2019లో ఈ లిస్టులో నెం.1 స్థానంలో ఉన్న విజయ్.. వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇన్నేళ్ళుగా టాలీవుడ్ లో మరే ఇతర హీరో కూడా సాధించలేకపోయిన ఘనతను యువ హీరో అందుకోవడం విశేషం. హైదరాబాద్ టైమ్స్ హిస్టరీలో హ్యాట్రిక్ టైటిల్ సాధించిన విజయ్ దేవరకొండ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్ ని వరుసగా మూడు సార్లు అందుకొని ప్రత్యేకమైన హిస్టరీ క్రియేట్ చేయడం పట్ల రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ స్పందించారు. హిస్టరీ అనే పదం నచ్చిందని.. ఫన్ గా కూడా ఉందని విజయ్ అన్నారు. ఇంకా మరిన్ని టైటిల్స్ అందుకొని ఎవరికైనా ఈ రికార్డును బీట్ చేయడం చాలా కష్టం అనిపించే రేంజ్ లో ఉండాలని.. చాలా కాలం పాటు ఆ రికార్డ్ అలానే ఉండిపోవాలని రౌడీ బాయ్ అన్నారు. పాన్ ఇండియా సినిమా చేస్తున్నందుకు ప్రెజర్ గా ఏమీ ఫీల్ అవడం లేదని చెప్పిన విజయ్.. మీరు సింగిల్ గా ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

ఎప్పుడూ సినిమాలలో పాత్రలకు తగ్గట్టుగా తన హెయిర్ స్టైల్ ఉంటోండిం ఈ మధ్య హెయిర్ మొత్తం పూర్తిగా ట్రిమ్ చేయాలనిపించింది. కానీ అలా చేయలేను అని వీడీ అన్నారు. ఈ ఇంటర్వ్యూ కేవలం అభిమానుల కోసమే ఇస్తున్నాను. నా సక్సెస్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని సంతోష పడుతుంటారు.. ఇప్పుడు ఇది చూసి వాళ్ళు కొన్ని నిమిషాలు హ్యాపీగా ఉన్నా చాలని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం విజయ్ ‘లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక తన సొంత బ్యానర్ 'కింగ్ ఆఫ్ ది హిల్' పై పలు చిన్న బడ్జెట్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు.



Full View
Tags:    

Similar News