నా డ్రస్‌ లపై ట్రోల్స్‌ ను పట్టించుకోను

Update: 2020-12-06 09:30 GMT
హీరోయిన్స్‌ అంటే అభిమానులతో పాటు విమర్శించే వారు ఉంటారు. అభిమానించే వారు కొన్ని సందర్బాల్లో విమర్శిస్తూ ఉంటారు. వారి ట్రోల్స్‌ ను కొన్ని సార్లు హీరోయిన్స్‌ తట్టుకోలేక బరస్ట్‌ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. హీరోయిన్స్‌ ఎక్కువగా డ్రస్‌ ల విషయంలో ట్రోల్స్‌ ను ఎదుర్కొంటూ ఉంటారు. బాలీవుడ్‌ కొత్త ముద్దుగుమ్మ అనన్య పాండే కూడా ట్రోల్స్‌ ను ఎదుర్కొందట. కెరీర్‌ ఆరంభంలో తాను వేసుకున్న డ్రస్‌ ల వల్ల చాలా మంది నన్ను ట్రోల్‌ చేశారు. ఆ సమయంలో చాలా బాధ పడ్డాను. ఒకానొక సమయంలో నా డ్రస్సింగ్‌ స్టైల్‌ ను మార్చుకోవాలని.. నా అభిరుచికి తగ్గట్లుగా జనాల కోసం కొత్త తరహా డ్రస్సింగ్‌ ను అలవాటు చేసుకోవాలనుకున్నాను.

ఎలాంటి డ్రస్‌ లు వేసుకున్నా కూడా  ట్రోలింగ్‌ ఆగిపోలేదు. దాంతో ఎవరి గురించో నేను ఎందుకు నా ఇష్టా ఇష్టాలను వదిలేయాలంటూ మళ్లీ నాకు ఆనందాన్ని ఇచ్చే డ్రస్‌ లనే వేసుకుంటున్నట్లుగా తాజాగా కరీనా కపూర్‌ టాక్‌ షో అయిన వాట్‌ వుమెన్‌ వాంట్‌ లో చెప్పుకొచ్చింది. తన కెరీర్‌ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాను అంది. నెపొటిజం పేరుతో కూడా నన్ను చాలా మంది ట్రోల్స్‌ చేస్తున్నారు. డ్రస్సింగ్‌.. నెపొటిజం గురించి వస్తున్న ట్రోల్స్‌ ను నేను పట్టించుకోవడం మానేశాను. వాటిని పట్టించుకుని ఉంటే కష్టం అనే విషయం అర్థం అయ్యింది. అందుకే నేను ట్రోల్స్‌ ను అస్సలు పట్టించుకోకుండా పాజిటివిటీని మాత్రమే తీసుకుంటున్నట్లుగా చెప్పింది.
Tags:    

Similar News